వస్తుసేవల పన్నుతో తగ్గేవి.? పెరిగేవీ.?

చూస్తుండగానే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) దేశవ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి ముగిసిన తర్వాత నుంచి ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ లు పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఎంపీలు, మీడియా, సీనియర్ రాజకీయ నేతల మధ్య అట్టహాసంగా జీఎస్టీ ని ప్రారంభించారు. జీఎస్టీ రాత్రి 12 గంటల నుంచి అమలులోకి రావడంతో ఈ పన్ను వల్ల ఎవరికీ మోదమో, ఎవరికీ ఖేదమో అనే చర్చ ప్రజల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు కొనసాగిన అనేక రకాల పన్నులు పోయి , జీఎస్టీ ఒక్కటే తెరపైకి రావడంతో అనేక అనుభవాలు ఎదురుకానుండడం ఆసక్తికరంగా మారింది. జీఎస్టీ వల్ల వ్యాపారుల జీరోదందాకు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే నూతన జీఎస్టీ పాలసీపై ప్రభుత్వం సరైన అవగాహన కల్పించకపోవడంతో పన్నుమోతపై ప్రజల్ల అయోమయం నెలకొంది.
ఆయా వస్తువులపై ప్రస్తుతం పన్ను ఎంత ఉంది.. GSTలో ఎంత ట్యాక్స్ విధించారో తెలుసుకుందాం… రోజువారీ వినియోగంలో ఇవి కొన్ని మాత్రమే. మొత్తం 1200 వస్తువుల ధరలు మారబోతున్నాయి.

టీ పౌడర్ : ప్రస్తుతం : 29%, GST తర్వాత 18%(తగ్గుతుంది)

కాఫీ పౌడర్ : ప్రస్తుతం : 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

చక్కెర : ప్రస్తుతం 10%, GST తర్వాత 5శాతం (తగ్గుతుంది)

నెయ్యి : ప్రస్తుతం 5%, GST తర్వాత 12శాతం (పెరుగుతుంది)

వెన్న : ప్రస్తుతం 14.5%, GST తర్వాత 12శాతం (తగ్గుతుంది)

హెయిర్ ఆయిల్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

టూత్ పేస్ట్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

సబ్బులు : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

చాక్లెట్లు, బిస్కెట్లు : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

బర్త్ డే, ఇతర కేకులు : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

ఐస్ క్రీమ్స్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)

మొబైల్ ఫోన్స్ : ప్రస్తుతం 6%, GST తర్వాత 12శాతం (పెరుగుతాయి)

కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు : ప్రస్తుతం 6%, GST తర్వాత 18శాతం (పెరుగుతాయి)

ఫర్నీచర్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 12శాతం (తగ్గుతాయి)

ఆయుర్వేద మందులు : ప్రస్తుతం 10%, GST తర్వాత 12శాతం (పెరుగుతాయి)

*చెప్పులు, బూట్లు ధరల్లో మార్పులు ఇలా :*
రూ.1000 పైన : ప్రస్తుతం 26.5%, GST తర్వాత 18శాతం (తగ్గుతాయి)

రూ.500-1000 మధ్య ఉంటే : ప్రస్తుతం 20.5%, GST తర్వాత 18శాతం (తగ్గుతాయి)

రూ.500లోపు ఉంటే : ప్రస్తుతం 5%, GST తర్వాత 5శాతం (మార్పు లేదు)

*రెడీమేడ్ దుస్తులు ధరల్లో మార్పులు ఇలా :*
రూ.1000పైన కొనుగోలు చేస్తే : ప్రస్తుతం 12%, GST తర్వాత 4.5శాతం (తగ్గుతాయి)

రూ.1000లోపు కొనుగోలు చేస్తే : ప్రస్తుతం 5%, GST తర్వాత 2.5శాతం (తగ్గుతాయి)

టీవీలు : ప్రస్తుతం 26%, GST తర్వాత 28శాతం (పెరుగుతాయి)

వాషింగ్ మెషీన్ : ప్రస్తుతం 26%, GST తర్వాత 28శాతం (పెరుగుతుంది)

ఫ్రిడ్జ్ : ప్రస్తుతం 26%, GST తర్వాత 28శాతం (పెరుగుతుంది)

మెక్రోఓవెన్ : ప్రస్తుతం 26%, GST తర్వాత 28శాతం (పెరుగుతుంది)

వైద్య పరికరాలు : ప్రస్తుతం 18%, GST తర్వాత 12శాతం (తగ్గుతాయి)

సిమెంట్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 28శాతం (తగ్గుతుంది)

పెద్ద వాహనాలు (కమర్షియల్) : ప్రస్తుతం 30%, GST తర్వాత 28శాతం (తగ్గుతాయి)

SUV కార్లు : ప్రస్తుతం 55%, GST తర్వాత 43శాతం (తగ్గతాయి)

లగ్జరీ కార్లు : ప్రస్తుతం 49%, GST తర్వాత 43శాతం (తగ్గుతాయి)

మీడియం కార్లు : ప్రస్తుతం 47%, GST తర్వాత 43శాతం (తగ్గుతాయి)

చిన్నకార్లు : ప్రస్తుతం 30%, GST తర్వాత 29శాతం (తగ్గుతాయి)

బైక్స్ : ప్రస్తుతం 30%, GST తర్వాత 28శాతం (తగ్గుతాయి).

To Top

Send this to a friend