48 గంటల్లో పేలనున్న బాంబ్..

దేశంలోనే అతిపెద్ద పన్నుల సంస్కరణకు వేళయ్యింది. మరో 48 గంటల్లో జూలై1 నుంచి దేశవ్యాప్తంగా ఒకే పన్నుల విధానం జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) అమలు కానుంది. ఇన్నాళ్లు పన్నులు చెల్లించకుండా తప్పించుకున్న వారందరూ ఈ జీఎస్టీ నుంచి తప్పించుకోలేరు. రాష్ట్రాలు ఇక నుంచి పన్నులు విధించడానికి ఉండదు.

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో భాగంగా దేశంలోని 1211 వస్తుసేవలను పలు కేటగీరిలుగా విభజించి వాటిపై పన్నును విధించింది. 5శాతం, 8శాతం, 12శాతం, 18శాతం, 28శాతం స్లాబుల్లో పన్ను విధించేందుకు సర్వం సిద్ధం చేసింది.

నిత్యావసర వస్తువులైన తాజా కూరగాయలు, తాజా మాంసం, చికెన్, చేపలు, గుడ్లు, పాలు, పెరుగు, బట్టర్ మిల్క్ , పిండి, బ్రెడ్, సహజమైన తేనె, ఉప్పు, ప్రసావం వంటి పదార్థాలపై పన్నులు వేయలేదు. వీటిని జీరోశాతం పన్నుల శ్లాబులో వేశారు. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా ఉపయోగించేవి ఇవే..

రైతులు, బీడీ కార్మికులు, వస్త్రవ్యాపారులపై జీఎస్టీ పెను భారం మోపింది. ఎరువులపై 12శాతం, బీడీ పొగాకుపై 28శాతం, వస్త్రవ్యాపారంపై 18శాతం పన్ను ఆయా రంగాలపై పెను ప్రభావం చూపనుంది.. సిమెంట్ పై 25శాతం మోపడంతో ధరల తరుగుదలలో మార్పు ఉండదు.
వ్యాపార సంస్థలన్నీ జూలై 1 నుంచి వ్యాట్ నుంచి జీఎస్టీలోకి

వ్యాపార సంస్థలన్నీ జూలై 1 నుంచి వ్యాట్ నుంచి జీఎస్టీలోకి మారాల్సిందే.. ఉద్యోగులు తొలి ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును సెప్టెంబర్ 25వరకు ఇచ్చారు. 100 రూపాయల టికెట్ దాటిన సినిమాలపై భారీ పన్ను విధించారు.

మొత్తంగా జీఎస్టీ వల్ల ఏఏ వస్తువులపై ఎంత పన్ను భారం వేశారనేది కింది పట్టికలో చూడొచ్చు. తద్వారా ఆయా వస్తువుల ధరలు పెరగడం/తగ్గడం జరుగుతాయి.

To Top

Send this to a friend