గురువు రుణం .. ‘శంకరాభరణం’.


శంకరాభరణం సినిమా తెలుగు సినీ చరిత్రలోనే గొప్ప మైలురాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన కే.విశ్వనాథ్ ఇటీవలే భారత దేశ అత్యున్నత సినిమా పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్నారు.. శంకరాభరణం సినిమా హీరోయిన్ గా ఎంటరై ప్రస్థానం ప్రారంభించిన అలనాటి నటి ‘తులసి’ ఇప్పుడు తన గురువు గారు కే.విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల సంతోషిస్తూ.. ‘శంకరాభరణం’ పేరు మీద అవార్డులను ప్రకటించింది..

భారత దేశలోని తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఉత్తమ నటులు, ఇతర నటీనటులకు ఈ శంకరాభరణం అవార్డులను తులసీ ఈరోజు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేసేందుకు ఖర్చు చేస్తోంది. రేపు హైదరాబాద్ లో ఈ అవార్డుల ఫంక్షన్ అతిరథ మహారథుల మధ్య వైభవంగా జరగనుంది. ముఖ్య అతిథిగా కే. విశ్వనాథ్ తో పాటు అన్ని భాషల అగ్రహీరోలు హాజరుకానున్నారు..

ఇక తులసీ ప్రకటించిన శంకరాభరణం అవార్డుల్లో తెలుగులో జనతా గ్యారేజ్ సినిమాలో అత్యంత నటన కనబర్చిన ఎన్టీఆర్ కు ఈ ఆవార్డు ప్రకటించారు. హిందీలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కు, తమిళంలో హీరో ధనుష్, మళయాళ సినిమాకు గాను దుల్కర్ సల్మాన్ కు ఈ అవార్డు ప్రకటించారు. ఇప్పటికే ఫిలింఫేర్ అవార్డు దక్కించుకున్న ఎన్టీఆర్ కు ఇప్పుడు శంకరాభరణం అవార్డు కూడా దక్కడం విశేషం.

To Top

Send this to a friend