మహేశ్ అభిమానులకు పండుగే..

మహేశ్ పుట్టిన రోజు ఆగస్టు 9 సందర్భంగా స్పైడర్ ట్రైలర్ ను విడుదల చేయాలని మురగదాస్ ప్లాన్ చేశాడు. అందులో ఫుల్ ట్రైలర్ తో పాటు సినిమా మొత్తం ఏ విషయంపై తీశారనేది మురగదాస్ చూపించనున్నాడట.. దీంతో ఆ ట్రైలర్ లో ఏముంటుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక ఈ స్పైడర్ సినిమా బిజినెస్ తెలుగు, తమిళ్ లో ఇప్పటికే పూర్తయిపోయిందట. దాదాపు రెండు భాషల్లో 180 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు సమాచారం. సెప్టెంబర్ 27న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

ఇప్పటికే గడిచిన నెలలో సూపర్ స్టార్ మహేశ్ బాబు తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా స్పైడర్ మూవీకి సంబంధించిన టీజర్ లింక్ ను చిత్రం యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. అందులో స్పైడర్ రోబోను చూపించి కంప్యూటర్ ముందు మహేశ్ బాబు ఏదో చేస్తున్నట్టు చూపించారు. ఈ ముక్తసరి టీజర్ మహేశ్ అభిమానులను అలరించలేదు. దీంతో అప్పటి నుంచి స్పైడర్ చిత్రం విశేషాల కోసం మహేశ్ అభిమానులు వెయిట్ చేస్తూనే ఉన్నారు..ఇటీవలే మహేశ్ బాబుకు సంబంధించిన లేటెస్ట్ పిక్ ను చిత్రం యూనిట్ విడుదల చేసినట్టు సమాచారం. అది సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఆ ఫొటో లుక్ లో మహేశ్ బాబు అదిరిపోయారు.

తాజాగా స్పైడర్ మూవీకి తమిళంలో కళ్లు చెదిరే రేట్స్ వచ్చాయి. ఈ మూవీ తమిళ రైట్స్ ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది. దాదాపు రూ.25 కోట్లు ముట్టజెప్పి చేజిక్కించుకున్నట్టు ప్రకటించారు. మహేశ్ బాబు కెరీర్ లోనే ఒక పరభాష తమిళంలో ఇంత రేట్ పెట్టిన మూవీ ఇంకోటి లేదట..

To Top

Send this to a friend