గెటప్ శీను జీవితం వడ్డించిన విస్తరి కాదు..

బుల్లితెర కమల్ హాసన్ అనే పేరు గెటప్ శీనుకు ఉంది. జబర్దస్త్ షోలో టైమింగ్ విషయంలో కానీ, కామెడీ విషయంలో కానీ గెటప్ శీను టీం నంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. చెప్పడానికి సుధీర్ కెప్టెన్ అయినా పర్ ఫామెన్స్ విషయంలో గెటప్ శీనును మించిన వారు లేరు.

అలాంటి మంచి నటుడు అయిన గెటప్ శీనుపై ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పాడు శీను. తాను ఏమీ ఈజీగా ఈ స్థాయికి రాలేదని.. తన బాల్యంలో ఎంతో కష్టపడ్డానని.. ఈ స్థితికి రావడానికి చిరంజీవియే స్పూర్తి అని అన్నారు. తన చిన్ననాటి జీవితంలో ఎంతో కష్టపడ్డానని.. ఈ నాలుగేళ్ల జీవితం చూసి తనపై అంచనాకు రావద్దని గెటప్ శీను అన్నారు. తాను 20 ఏళ్లుగా కష్టపడితే ఈ స్థితికి వచ్చానని చెప్పుకొచ్చాడు.

శీను స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు దగ్గర ఉండే ఆకీవీడులోని కళింగపాలెంలో బొట్టుపల్లి రామస్వామికి మూడో సంతానంగా గెటప్ శీను జన్మించాడు. అన్నా అక్కల తర్వాత శీను. వారి కుటుంబం అష్టకష్టాలు అనుభవించిందట.. 5వ తరగతిలో ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేక ప్రభుత్వ హాస్టల్ లో ఉండి శీను చదువుకున్నాడట.. సెలవులు వస్తే ఇంటికి 12 కి.మీలు కాలినడకన నడిచిపోయే కటిక దారిద్ర్యంలో ఉండేవాడట.. ప్రతి ఎండాకాలం వేసవి సెలవుల్లో శీను చెరుకు మిషన్ పనులకు వెళ్లి తన చదువుకు కావాల్సిన సొమ్మును, పుస్తకాలు, బట్టల కోసం సొంతంగా కష్టపడి సంపాదించుకునే వాడట.. ఇక స్కూళ్లకు శని ఆదివారాలు సెలవులిస్తే పంట కుప్ప నూర్పుడు లాంటి పనులకు వెళ్లేవాడట.. అలా సంపాదించిన డబ్బుతో అమ్మకు ఇచ్చేవాడట.. కుటుంబమంతా కష్టపడి బతికేవారట.. శీను పనులకు వెళ్లినప్పుడు ఎన్నో సార్లు నత్త గుల్లలు కూడా కాళ్లకు గుచ్చుకున్నాయని ఆ గాయాలు కూడా ఇంటర్వ్యూలో చూపించాడు. కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్నాని వాపోయాడు..

అనాటి నుంచి కష్టపడి చదువుకొని పైకెదిగి సినిమాల్లో అవకాశాల కోసం తిరిగి కమెడియన్ గా సెటిల్ అయ్యాడు శీను.. ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు… మణికొండలో ట్రిపుల్ బెడ్ రూం ఫ్లాట్ కూడా కొన్నాడు. తన కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉన్నాడు. ఇలా శీను కష్టం చూసి మెచ్చుకోవాలని దెప్పి పొడవద్దని తన కష్టాన్ని ఇంటర్వ్యూలో చెప్పి అందరికీ కనువిప్పు కలిగించాడు

To Top

Send this to a friend