భారత్ పాక్ పోటీకి ఎంత డిమాండో తెలుసా..

చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాక్ ఫైనల్ చేరడంతో దీన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ సంస్థ భారీగా రేట్లను పెంచేసింది. అన్ని లీగ్ మ్యాచ్ లకు ఒక రేటును వసూలు చేసిన స్టార్ స్పోర్ట్స్ సంస్థ ఇండియా-పాక్ ఫైనల్ మ్యాచ్ అనగానే 10 రెట్లు ఎక్కువ చార్జీలను యాడ్ కంపెనీల నుంచి వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. 30సెకన్ల పాటు ప్రసారమయ్యే యాడ్ కు కోటి రూపాయల రేటును పెట్టినట్టు సమాచారం. భారత్-పాక్ జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ సంస్థ 30 సెకన్లకు కోటి ధర పెట్టడంతో పునరాలోచనలో పడ్డాయి కానీ కొన్ని సంస్థలు ఎంతైనా పెట్టడానికి ముందుకు రావడం గమనార్హం.

భారత్-పాక్ శత్రుదేశాలు. ఇప్పటికే ఇవి రెండు యుద్ధాల్లో తలపడ్డాయి. ఇప్పటికీ రెండు దేశాల బార్డర్ లో నిత్యయుద్ధమే.. అలాంటి శత్రుదేశాలు ఇంటా బయటా క్రికెట్ ఆడుకోవడం ఎప్పుడో మానేశాయి. అందుకే ఇప్పుడు ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్ వేదిక మీదే ఇండియా-పాక్ లు తలపడుతున్నాయి. లీగ్ మ్యాచ్ లోనే టీవీలకు అతుక్కుపోయే జనాలకు ఇప్పుడు భారత్ పాక్ లు ఫైనల్ చేరడంతో మరింత చూసేందుకు ఎగబడుతున్నారు..

చాంపియన్స్ ట్రోఫీ లో భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం మ్యాచ్ చూసేందుకు ఇండియా, పాక్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు రెడీ అయిపోయారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రసారాల హక్కుదారు స్టార్ స్పోర్ట్స్ సంస్థ 10 రెట్లు యాడ్స్ ధరలు పెంచడం సంచలనంగా మారింది.

To Top

Send this to a friend