ప్రత్యేక హోదా కోసం పక్కరాష్ట్రం నుంచి పోరాటం..

ఏపీలో ఇప్పుడు ప్రత్యేక హోదా బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే అది వైఎస్ జగనే.. హోదా కోసం ఆయన మదిలో మెలిసినప్పుడో లేక పవన్ , కాంగ్రెస్ నాయకులు తట్టినప్పుడు మాత్రమే హోదా ఆయనకు గుర్తుకు వస్తుంది. ఠక్కున హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచి ఏపీ పర్యటనకు వచ్చి ఆందోళన చేస్తాడు. అనంతరం హైదరాబాద్ తిరిగి వెళ్లిపోతాడు. ఇలా ఏపీలో విదేశీ పర్యటన చేస్తున్న జగన్ వైఖరిని ఎండగట్టాలని తాజాగా టీడీపీ నాయకులు ఫోకస్ చేసినట్టు సమాచారం.

చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను వదిలి ఏడాదికి పైగా అవుతోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో కృష్ణానది ఒడ్డున స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని సువిశాల భవనంలో ఉంటూ ఏపీ పరిపాలనను సాగిస్తున్నాడు. ఆయన భార్య భువనేశ్వరీ, కోడలు బ్రాహ్మణిలో కూడా వీకెండ్ లలో ఇక్కడికే వస్తున్నారు. చంద్రబాబు అమరావతిలో ఉంటుండగా.. ఏపీ హక్కుల కోసం పోరాడుతానని బీరాలు పలుకుతున్న వైసీపీ అధినేత జగన్ మాత్రం హైదరాబాద్ లోటస్ పాండ్ లోనే ఉంటూ ఏపీ సమస్యలపై చుట్టపు చూపుగా పోరాడుతున్నారు. ఇప్పుడు ఇదే అంశాన్ని టార్గెట్ చేసి ఎండగట్టాలని టీడీపీ నేతలు ప్లాన్ చేసినట్టు సమాచారం…

వైఎస్ జగన్ అప్పట్లోనే విజయవాడలో మకాం కోసం ప్రయత్నించారు. కార్యాలయంతో పాటు వైఎస్ జగన్ ఉండడానికి వీలుగా విజయవాడ పరిసరాల్లో సువిశాల భవనాన్ని చూశారు. బెజవాడ బందర్ రోడ్డులో, తాడిగడప రోడ్డులో, విజయవాడ మొగల్రాజపురంలో భవనాలు చూశామని వైసీపీ నేతలు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు అవి పట్టాలెక్కలేదు. జగన్ విజయవాడ రాలేదు. రేపుమాపు అంటూ వైసీపీ కార్యాలయం, ఇంటిని ఏర్పాటు చేసుకోవడం లేదు. ఇంకా పక్కరాష్ట్రం తెలంగాణ నుంచి ఏపీ రాజకీయాలను శాసిస్తున్నారు. అందుకే ఇదే అంశాన్ని టీడీపీ నేతలు టార్గెట్ చేసినట్టు సమాచారం.

To Top

Send this to a friend