‘ఫిదా’ ట్రైలర్‌ రివ్యూ

 

 

వరుణ్‌ తేజ్‌, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘ఫిదా’. ఇటీవలే ఈ చిత్రం టీజర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్‌తోనే ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్‌ సాయి పల్లవి ట్రైలర్‌తో మరింతగా ఫిదా చేసింది. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూసేద్దామా అన్నట్లుగా ఉంది. పల్లెటూరు, పక్కా మాస్‌ అమ్మాయితో ఎన్నారై కుర్రాడి ప్రేమ కథగా ‘ఫిదా’ తెరకెక్కినట్లుగా ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.

‘మిస్టర్‌’ చిత్రంతో అట్టర్‌ ఫ్లాప్‌ అయిన వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాతో అయినా కమర్షియల్‌గా సక్సెస్‌ను దక్కించుకుంటాడా అనేది చూడాలి. శేఖర్‌ కమ్ముల ఇప్పటి వరకు ‘ఆనంద్‌’, ‘హ్యాపీడేస్‌’, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ వంటి క్లాస్‌ చిత్రాలను తెరకెక్కించాడు. మొదటి సారి ఒక పూర్తి మాస్‌ ప్రయత్నం చేశాడు. శేఖర్‌ కమ్ముల ఈ టైప్‌ ప్రాజెక్ట్‌లను కూడా విజయవంతంగా టేకప్‌ చేయగలడు అనిపించుకుంటున్నాడు. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగి పోతున్నాయి.

సాయి పల్లవి సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోవడంతో పాటు ఆమె లుక్‌ సినిమాకు హైలైలట్‌గా నిలుస్తుందనిపిస్తుంది. వరుణ్‌ తేజ్‌ కూడా ఎన్నారై కుర్రాడిగా ఆకట్టుకుంటున్నాడు. వీరిద్దరి మద్య రొమాన్స్‌ వర్కౌట్‌ అవుతుందేమో అని ట్రైలర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. భారీ అంచనాలున్న ఈ సినిమాను వచ్చే నెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం చేస్తున్నారు.

To Top

Send this to a friend