బిగ్ బాస్ లో అందరూ ఏడ్చేశారు..

సెంటిమెంటుకు ఎవరూ అతీతం కాదని మరోసారి నిరూపితమైంది. బంధాలు, అనుబంధాలు దూరంగా ఉంటేనే వాటి విలువ తెలుస్తుందని అర్థమైంది. బిగ్ బాస్ షోలో మరోసారి ఈ సెంటిమెంట్ కు అందరూ ఏడ్చేశారు. గురువారం రాత్రి ఎపిసోడ్ మొత్తం చివరలో జరిగిన సంఘటనతో గంభీరంగా మారిపోయింది. బిగ్ బాస్ షో రంజుగా సాగుతోంది. బుధవారం ఎపిసోడ్ లో హీరో ప్రిన్స్, హీరోయిన్ దీక్షలకు ముద్దిచ్చి ఆ రోజును రక్తికట్టించాడు. ఒప్పో పైసా వసూల్ టాస్క్ లో ఎవరు బెస్ట్ పర్ ఫామెన్స్ , ఎవ్వరు చెత్త పర్ ఫామెన్స్ ఇచ్చారో చెప్పాలని హౌస్ కెప్టెన్ ప్రిన్స్ ను ఆదేశించాడు బిగ్ బాస్.. ఈ టాస్క్ లో కత్తి కార్తీక, ఆదర్స్ బెస్ట్ పర్ ఫామెన్స్ ఇచ్చారని..

ఇక చెత్త పర్ ఫామెన్స్ సమీర్, దీక్షలు ఇచ్చారని ప్రిన్స్ చెప్పాడు.. దీంతో బిగ్ బాస్ సమీర్, దీక్షలకు పెద్ద ఉల్లిపాయల బస్తా ఇచ్చి వాటిని బిగ్ బాసే చెప్పే వరకు కోస్తూనే ఉండాలని ఆదేశించాడు. అలా వారికి పనిష్ మెంట్ పడింది. ఇక పైసావసూల్ షోలో బెస్ట్ పర్ ఫామెన్స్ ఇచ్చిన కత్తి కార్తీక, ఆదర్స్ లను వచ్చే వారానికి కెప్టెన్ కోసం ఎంపిక చేస్తున్నట్టు బిగ్ బాస్ ప్రకటించారు. ఇక
ఆ గేమ్ ముగిశాక సాయంత్రం బిగ్ బాస్ మరో టాస్క్ ఇంటి సభ్యులకు ఇచ్చాడు. అదే ‘సెరా ఈత.. మెదడుకు మేత..’ ఒక చిత్రపటాన్ని ఉంచి కొన్ని పెయింటెడ్ టైల్స్ ను ఉంచి స్విమ్మింగ్ ఫూల్ కరెక్ట్ గా ఎవరు పెడుతారో వారే విజేతలని.. వారికి ఓ బహుమానం ఇస్తానని ప్రకటించాడు. దీంతో ముమైత్, ధన్ రాజ్ ఇద్దరూ స్విమ్మింగ్ ఫూల్ లో టైల్స్ ను అమర్చారు. వేగంగా అమర్చిన ముమైత్ ఖాన్ గెలిచింది. గెలిచిన ముమైత్ ఖాన్ కు బిగ్ బాస్ ఓ బహుమానం ఇచ్చాడు.. అది పెరుగు, కాఫీ కావాలా..? లేక ధన్ రాజ్ కోసం ఓ మెమరబుల్ గిఫ్ట్ కావాలా అని అడిగాడు. దీనికి ముమైత్ ధనరాజ్ మెమరబుల్ కావాలని కోరింది.

అనంతరం ఇంట్లోని రూంలో అమర్చిన రూంలో ధన్ రాజ్ ఎనిమిది నెలల గర్భిణి అయిన భార్య, కొడుకు వీడియోలో మాట్లాడారు. మేం చాలా బాగా ఉన్నామని.. మీరు బాగా ఆడాలని ధన్ రాజ్ భార్య, కొడుకు ప్రేమగా చెప్పాడు. ఈ మాటలకు బిగ్ బాస్ హౌస్ లోని అందరూ ఏడ్చేశారు. ముఖ్యంగా ఆదర్ష్, ధన్ రాజ్, కత్తి కార్తీక, అర్చన సహా అందరూ ఏడ్చి ధన్ రాజ్ ను పట్టుకొని కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఇలా గురువారం 19వ రోజు షో సెంటిమెంట్ టాస్క్ లతో ముగిసిపోయింది. కెప్టెన్ రేసులో కత్తి కార్తీక, ముమైత్ ఖాన్, ఆదర్స్ లను చివరగా బిగ్ బాస్ ప్రకటించారు.

To Top

Send this to a friend