ప్రతి జర్నలిస్టూ ఇది చదవాల్సిందే..

నమస్తే తెలంగాణ పత్రిక న్యూస్ నెట్ వర్క్ ఇన్ చార్జి మార్కండేయాను ఆ పత్రిక నుంచి సీఎం కేసీఆర్ తొలగించడం.. ఆయన సోషల్ మీడియా సాక్షిగా దీనిపై కేసీఆర్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో ఈ వివాదం ముదిరిపోతోంది. ఎవరికి తోచిన విధంగా వారు మార్కండేయ చేసిన అవినీతిని, నమస్తే తెలంగాణ పత్రికను ఎలా భ్రష్టు పట్టించింది వివరిస్తూ పోస్టులు పెట్టేస్తున్నారు.

మార్కండేయ మాజీ మావోయిస్టు అనేది నిజమే! ఆయన ఆంధ్రజ్యోతిలో పని చేసినప్పుడూ మాజీ మావోయిస్టునే. నమస్తే తెలంగాణలోనూ మాజీ మావోయిస్టునే. కొత్తగా యాజమాన్యానికి తెలిసింది ఏమిటి? అయినా అభ్యంతరం పెట్టింది అందుకా? కథనం రసవత్తరంగా వడ్డించటానికి ఆయన మావోయిస్టుల పేరు వాడుకున్నాడు. మాజీ మావోయిస్టు అయినందునే కేసీఆర్ తనను తొలగించాడని అపనింద మోపాడు. అయినా సిద్ధాంతం, నిబద్ధత ఉన్నోడు అయితే ఆంధ్రజ్యోతిని వదిలి ఎందుకొస్తడు? బయటికి వచ్చి ఇప్పుడు ఆదర్శాలు మాట్లాడితే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.

ఇక మార్కండేయ తనకాడి కొచ్చే సరికి తనకు కేసీఆర్ అన్యాయం చేశాడని తెగ బాధ పడిపోతున్నాడు.. మార్కండేయకు దెబ్బ తగిలితే ఆయన అనుయాయులందరూ సోషల్ మీడియాలో ఆయన మద్దతుగా పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నారు. కులగజ్జితోటి జర్నలిస్టుల పొట్ట మీద కొట్టినప్పుడు ఈ నొప్పి మార్కండేయకు తెలియదా? ఎంతోమంది ఇష్టం లేని జర్నలిస్టులను తొలగించడం.. బదిలీలు చేసినప్పుడు వారి బాధ మార్కండేయకు తెలియదా అంటే దానికి ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు తన దాకా వచ్చేసరికి తన జాబ్ పోయే సరికి గగ్గోలు పెడుతున్నాడు. నూరు గొడ్లను తిన్న రాబందువు కూడా కూలుతది అన్న సత్యం తెలియదా! అందరు జర్నలిస్టులకు జరిగినట్టే ఆయనకు జరిగింది. అందరూ బయటకు రాక ఏదో సంస్థలో వేరే ఉద్యోగాల్లో చేరారు. కానీ మార్కండేయా తనను తొలగించినందుకు కేసీఆర్ తో కయ్యానికి కాలు దువ్వాడు. అదే తేడా..

To Top

Send this to a friend