జగన్ పై చర్యలకు ఈసీ ఆదేశం..

నంద్యాల ఉప ఎన్నికల్లో నడిరోడ్డుమీద సీఎం చంద్రబాబును కాల్చిపారేయాలని పరుష విమర్శలు చేసిన జగన్ పై టీడీపీ నేతలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు నంద్యాల ఉప ఎన్నికల ఓటింగ్ నేపథ్యంలో జగన్ చేసిన విమర్శలపై ఈసీ స్పందించింది. జగన్ పై స్థానిక ఎలక్షన్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. దీంతో జగన్ చిక్కుల్లో పడ్డారు.

నంద్యాలలో గెలవడం కోసం టీడీపీ, వైసీపీ హోరాహోరీ తలపడ్డాయి. నంద్యాల ఉప ఎన్నిక… రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా గుబులు పుట్టించింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏపీలో అధికార టీడీపీతో కలిసి బీజేపీ అంటకాగింది. రాష్ట్రంలో, కేంద్రంలో టీడీపీ-బీజేపీ కలిసి ప్రభుత్వాలను నడిపిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నిక ఓ రకంగా ఫ్రీ ఫైనల్ పరీక్ష లాంటిదే. ప్రజల అభిప్రాయాన్ని వివరించడంలో ఈ ఎన్నిక ఖచ్చితంగా దోహదపడుతుంది. ఈ నేపథ్యంలోనే డూ ఆర్ డైలా వైసీపీ, టీడీపీలు పోరాడాయి. నంద్యాలలో ఎవరు గెలుస్తారో ఆ పార్టీకే వచ్చే 2019 ఎన్నికల్లో అధికారం ఖాయమని ప్రచారం జరిగింది. దీంతో జగన్ రెచ్చిపోయి ప్రచారం చేశారు. చంద్రబాబును కాల్చేయాలంటూ తీవ్ర విమర్శలు చేశారు.

టీడీపీ పార్టీ తరఫున చంద్రబాబుతో పాటు బాలక్రిష్ణ, వేణుమాధవ్ లు కూడా జగన్, రోజాపై తీవ్ర విమర్శలే చేశారు. జగన్ చేసిన విమర్శలు మాత్రం హైలెట్ అయ్యాయి. దీనిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం.. ఈసీ స్పందించడంతో జగన్ చిక్కుల్లో పడ్డాడు. జగన్ పై చర్యలకు ఆదేశించడంతో ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.

To Top

Send this to a friend