ఎక్కువ ఖర్చు పెట్టారో..


ఆఖరుకు ప్రధాని మోడీజీ పెళ్లిళ్లను కూడా వదలడం లేదు. విజయ్ మాల్యాలాంటి ధనవంతులు కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో విలాసాలు గడుపుతున్నా పట్టించుకోడు మోడీజీ.. సామాన్యుడు చచ్చీ చెడీ 2 .50 లక్షలు జమ చేసుకుంటే మాత్రం లెక్కలు చెప్పాలట.. పెళ్లిళ్లు గ్రాండ్గా చేసుకున్నా ఆదాయ పన్ను అధికారులకు లెక్కలు చూపాలట.. ఇదెక్కడి ఖర్మరా బాబూ అంటూ మోడీ ఐటీ పాలసీపై తలపట్టుకుంటున్నారు సామాన్యులు..

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం పెళ్లి ఖర్చులకు కూడా ఐటీ డిపార్ట్ మెంట్ కి లెక్క చెప్పాల్సి ఉంటుంది. పెళ్లి ఖర్చులకు, మీ బ్యాంకు బ్యాలెన్స్‌కు మధ్య వ్యత్యాసముంటే వివరణ కూడా ఇవ్వాలి. వారు సంతృప్తి చెందేలా వివరణ ఇవ్వకుంటే చిక్కుల్లో పడక తప్పదు. గతేడాది నవంబరులో పెద్ద నోట్లు రద్దు చేసి షాక్ ఇచ్చిన కేంద్రం తాజాగా ఆదాయ పన్ను సవరణతో మరో షాక్ ఇచ్చింది. తాజా చట్ట సవరణతో..

వ్యక్తులు తమ ఆదాయానికి, వ్యయానికి సరైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఐటీ చట్టం ప్రకారం 35 శాతం నుంచి 83 శాతం వరకు పన్ను కట్టాల్సి ఉంటుంది. అప్పు తెచ్చుకున్నా.. అది రికార్డెడ్ గా నిరూపించలేకపోతే ఆ సొమ్ముపైనా ముక్కు పిండి మరీ పన్ను కక్కిస్తారు మీచేత. ఒక్కసారిగా బ్యాంకు ఖాతాలో డబ్బు పెద్ద మొత్తంలో జమ అయినా కూడా ఇన్ కం ట్యాక్స్ అధికారులు ధడేల్ మంటూ మీ ఇంటి తలుపు కొడతారు. ఆ డబ్బుఎక్కడి నుంచి వచ్చిందో నిరూపించలేకపోతే మాత్రం తిప్పలు తప్పవు. చిన్నతరహా పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీ ప్రారంభించే సమయంలో పెట్టే సీడ్ మనీకి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా పదిలపరుచుకోవాలి.

ఆదాయపన్ను అధికారులకు రికార్డులు సమర్పించడంలో విఫలమైతే పన్ను కామన్. ఇక నెలవారీ ఖర్చులు పెరిగినా ఇబ్బందులు తప్పవు. పెరిగిన ఖర్చును ఎలా భరించారో, అకస్మాత్తుగా అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఐటీ అధికారులు వివరణ అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

To Top

Send this to a friend