ఈ కోయిల ముందే కూసింది..


తెలుగుదేశం పార్టీలో అనూహ్యంగా పాపులర్ అయ్యారు ఎమ్మెల్యే అనిత.. రోజా తో వివాదం కారణంగా రాత్రికి రాత్రే అనిత పేరు మారుమోగిపోయింది.. రోజాను దెబ్బతీయడం కోసం చంద్రబాబు లౌక్యంగా అనితను తెరపైకి తెచ్చారు. ఆమెను ప్రోత్సహించారు. దీంతో వెనుకా ముందు చూసుకోకుండా ఎమ్మెల్యే అనిత రెచ్చిపోయి రోజాపై ఇంటా బయటా ఎదురుదాడికి దిగారు.. ఇలా తనకు మంత్రివర్గ విస్తరణలో పదవి వస్తుందని ఆశించారు.. కానీ అక్కడున్నది చంద్రబాబు మరీ.. అందుకే ఇప్పుడు పదవి రాకపోయేసరికి చంద్రబాబు తనను ఉపయోగించుకొని వదిలేశాడని తెలిసి అనిత వాపోతోంది..

నిజానికి ఎమ్మెల్యే రోజా గతంలోనే అనితను ఈ విషయంలో హెచ్చరించింది. రోజా చెప్పినట్టే మంత్రివర్గ విస్తరణలో అనితకు ఉన్న మంత్రి పదవి దక్కలేదు.. దీంతో తత్త్వం బోధపడిన అనిత ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అనవసరంగా నోరుపారేసుకొని వైసీపీకి టార్గెట్ అయ్యానని.. ఇప్పుడు టీడీపీలో కూడా తనకు ప్రాధాన్యం లేదని అనిత తోటి నాయకులతో వాపోతోంది. చంద్రబాబు ఇలానే నాయకులను వాడుకొని వదలేస్తారని.. ఆయన కోసం నోరుపారేసుకుంటే ఇలానే దెబ్బైపోతారని టీడీపీ నాయకులే ఇన్ సైడ్ గా వ్యాఖ్యానిస్తారు..

చంద్రబాబుదీ ఆది నుంచి అదే శైలి. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడంలో చంద్రబాబు.. ఆయన అనుకూల మీడియాది అందేవేసిన చేయి. రాత్రికి రాత్రే నాయకులను పాపులర్ చేయగలరు.. అంతేస్థాయిలో వీరు పనికిరారు అని ప్రచారం చేయగలరు.. బొజ్జల మంత్రి పదవి తీసేయడంలో.. ఇప్పుడు ఆశపడ్డ అనిత భంగపాటుకు గురి అవడంలో ఆరోపణలు చేస్తున్న వారు ముందు చంద్రబాబు మనస్తత్వం తెలుసుకొని ముందుకెళ్తే మంచిది..

To Top

Send this to a friend