ఆలూ తింటే లావవుతారా? సన్నబడతారా.?

ఆలూ చిప్స్ అన్నా.. ఆలూ ఫ్రై అన్నా పిల్లలు చాలా ఇష్టపడి తింటారు.. ఎన్నో పోషకాలు కలిగిన ఆలుగడ్డతో చేసిన వంటకాలకు విదేశాల్లో డిమాండ్ ఎక్కువ.. ఈ ఆలుగడ్డతో చేసే వంటకాలు అనేకం. వీటిని ఇష్టపడని వాళ్లు కూడా బహుశా ఉండరేమో! కానీ ఆలుగడ్డలు తింటే లావవుతారా? ఆరోగ్యానికి మంచివి కావా? ఇందులో నిజమెంత?

ఆలుగ్డల వేపుడు, కూర, పులుసు, చిప్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వంటకాలను ట్రై చేయొచ్చు. ఇవన్నీ ఇష్టంగా తినేవాళ్లు కూడా చాలామంది ఉండి ఉంటారు.
ఆలుగడ్డల్లో కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి బియ్యం, గోధుమల్లో ఉన్నవాటికంటే సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్లు. దీంతో జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. వీటిని మధుమేహం ఉన్నవారు కూడా తినవచ్చు. దీనివల్ల వారి రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగవు. పైగా చాలామంది దీన్ని పొట్టు తీసి తింటారు. ఇలా చేయొద్దంటున్నారు వైద్యులు. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను పోగొడుతుంది.

ఇక ఆలుగడ్డలను తింటే లావు అవుతారనడం అపోహే! సాక్షాత్తూ ఈ మాటను వైద్యులే చెబుతున్నారు. అయితే ఆలుగడ్డను వండి, బేక్ చేసి, రోస్ట్ చేసి, కాల్చి తింటే ఏం కాదు. అలాకాకుండా వేపుళ్లు, చిప్స్‌లా చేసుకొని తింటే వంద శాతం ఆరోగ్యానికి ప్రమాదమే. ఇలా చేసుకొని తింటే మాత్రం కచ్చితంగా లావవుతారట. సాధారణ పద్ధతిలో కూర వండుకొని తింటే ఎలాంటి ప్రమాదమూ ఉండదని చెబుతున్నారు నిపుణులు.

To Top

Send this to a friend