డ్రగ్స్ కేసులో ముందుకెళితే మీ పిల్లల్ని చంపేస్తాం..

డ్రగ్స్ మాఫియా.. కొన్నేళ్లుగా హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకొని విజృంభిస్తోంది. అలాంటి మాఫియాను కూకటి వేళ్లతో సహా పెకిలించేందుకు రెడీ అయ్యారు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్. ఆయనకు సీఎం కేసీఆర్ పూర్తి స్వేచ్ఛనివ్వడంతో చెలరేగిపోతున్నారు. డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్న సినీ ప్రముఖులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చి వారిని విచారిస్తున్నారు. దీంతో డ్రగ్స్ సరఫరా, ఆగడాలు హైదరాబాద్ లో తగ్గిపోయాయి. దీన్ని మనసులో పెట్టుకున్న అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా ఈ కేసును పర్యవేక్షిస్తున్న ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ ను టార్గెట్ చేశారు.

నిన్న ఆయనకు మూడు ఇంటర్నెట్ కాల్స్ వచ్చాయి. అందులో ఆఫ్రియా యాసలో కొంతమంది ఆయనను బెదిరించారు.. ‘నువ్ ఎక్కడ ఉంటావో తెలుసు. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో మాకు తెలుసు. ఈ కేసులో ఇంకా ముందుకెళితే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే’నని ఫోన్ లో బెదిరించారు. ఈ విషయాన్ని అకున్ ప్రభుత్వానికి విన్నవించగా వారి పిల్లలకు, వారు చదివే స్కూళ్లో టైట్ సెక్యూరిటీ పెట్టినట్టు సమాచారం.

ఈ కేసులో దూకుడుగా ముందుకెళ్తున్న అకున్ వల్ల హైదరాబాద్ లో డ్రగ్స్ కార్యకలాపాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఆఫ్రికా కేంద్రంగా డ్రగ్స్ తయారు చేసి ముఠాలు ప్రపంచంలోని వివిధ దేశాలకు సరఫరా చేస్తుంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లో అకున్ సభర్వాల్ అడ్డుకట్ట వేయడంతో ఆఫ్రికా అంతర్జాతీయ స్మగ్లర్లే ఆయనకు ఫోన్ కాల్స్ చేసినట్టు సమాచారం. హైదరాబాద్ లో ఉన్న నైజీరియన్లు ఆఫ్రికా నుంచి ఆ డ్రగ్స్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంటారు. తమకు అడ్డువచ్చే ఏ పోలీస్ ఆఫీసర్ ను వీరు వదలరు. దీంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఆ ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి ఎవరు చేశారో తెలుసుకునే పనిలో పడింది. అకున్ సభర్వాల్ కుటుంబానికి సెక్యూరిటీ పెంచినట్టు తెలిసింది.

To Top

Send this to a friend