భరత్ చచ్చి టాలీవుడ్ ను ముంచాడు..

 

ఒకటా రెండా.? ఇప్పటికే 12 మంది తెలుగు సినీ ప్రముఖులకు తెలంగాణ ఎక్సైజ్ ప్రొషిబిషన్ శాఖ డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చింది. ఇప్పుడా లిస్ట్ పెద్దదైంది. మరో 20 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. రవితేజ తమ్ముడు భరత్ డ్రగ్స్ తీసుకోని మరణించడం.. అతడి సెల్ ఫోన్ లో డ్రగ్స్ అమ్మకం దారు లపేర్లు ఉండడం.. అది పోలీసులు తీగలాగితే కొండనే కదిలివస్తోంది. టాలీవుడ్ ప్రముఖుల డ్రగ్స్ కోణం బయటకు వస్తోంది.. భరత్  మరణం ఇప్పుడు టాలీవుడ్ ను ముంచేస్తోంది..

 

భరత్ చావుతో టాలీవుడ్ డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. రవితేజ తమ్ముడు భరత్.. బాగా మద్యం తాగి, డ్రగ్స్ తీసుకొని రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతడి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో కెల్విన్ అనే డ్రగ్ స్మగ్లర్ కు భరత్ చాలా సార్లు ఫోన్ చేసినట్టు ఉంది. అంతేకాకుండా భరత్ వాట్సాప్ లో డ్రగ్స్ మాఫియా సభ్యులతో చిట్ చాట్ నిర్వహించాడు.   తెలుగు ఇండస్ట్రీలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారం పోలీసులు గుర్తించారు. దీంతో విచారణ మొదలుపెట్టి కెల్విన్ ను అరెస్ట్ చేసి విచారించగా.. డ్రగ్స్ తీసుకుంటున్న టాలీవుడ్ ప్రముఖుల గుట్టు బయటపడింది..

 

భరత్ అన్న రవితేజతో పాటు అతడితో సన్నిహితంగా ఉండే దర్శకుడు పూరి జగన్నాథ్  డ్రగ్స్ తీసుకుంటున్నట్టు విచారణలో తేల్చారు. ఇక పూరికి సన్నిహితంగా ఉండే చార్మి, సుబ్బరాజు, శ్రీనివాసరాజు, శ్యామ్ కే నాయుడు సహా ఏడుగురు డ్రగ్స్ కొనుగోలు దారులేనని పోలీసులు గుర్తించారు. ఇలా భరత్ చావు టాలీవుడ్ ప్రముఖుల మెడకు డ్రగ్స్ దందాను అంటకట్టింది. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీనే షేక్ చేస్తోంది.

To Top

Send this to a friend