ఉదయం టిఫిన్ మంచిదేనా.?

అంతా రసాయన మందుల వాడకాలు పెరిగిపోయాయి. ఇప్పుడిప్పుడే జనంలో ఔషధాలు, హోమియోపతి,అల్లోపతి లాంటి ప్రకృతిసిద్ధ వైద్యం గురించి అవగాహన పెరుగుతోంది. పతంజలి లాంటి నేచురల్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. భారతీయులు పూర్వం ఔషధ మొక్కలతో తయారు చేసిన మందులు వాడేవారు. అవి ఎంతో మెరుగైన ఫలితాలు ఇచ్చేవి. ప్రాణాలు నిలబెట్టేవి. ఇప్పటి రసాయన మందులు సైడ్ ఎఫెక్టులనే ఇస్తున్నాయి.

ఇక పూర్వం ఎంతో మంది మేధావులు మనిషి ఆహార నియమాలపై ఎన్నో గ్రంథాల్లో వివరించారు. రుషులు, పురాతన వైద్యులు.. ఉదయాన్నే పుష్టుగా భోజనం చేయాలని చెప్పేవారు. తద్వారా రాత్రి పడుకొని లేచాక తొందరగా శక్తి వస్తుందని పని బాగా చేయగలరని నమ్మేవారు. అంతేకాదు.. మధ్యాహ్నం పూట తక్కువ తినాలని సనాతన భారతీయ గ్రంథాల్లో రాసి ఉంది. దీనివల్ల చేసే పని చురుగ్గా చేస్తారని నిద్ర రావడం తదితర సమస్యలు ఉండవని ఉంది..

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ పరిశోధకులు ఇటీవల చేసిన పరిశోధన ఫలాలు.. భారతీయులు పూర్వ కాలంలో చేసిన పనులకు కరెక్ట్ గా సరిపోయాని కితాబివ్వడం విశేషం.. భారతీయ సనాతన ధర్మంలో చేసిన ప్రతి పనికీ ఓ అర్థం పరమార్థం ఉందని.. కానీ నేడు ఆ ధర్మాలను ఎవరూ పాటించడం లేదని సదురు పరిశోధకులు తేల్చిచెప్పారు. ఇప్పుడీ భారతీయ గ్రంథాలను ఆధారంగా చేసుకొని అమెరికా లాస్ ఎంజెల్స్ పరిశోధకులు దాదాపు 50వేల మందిపై పరిశోధన జరిపారు.

అల్పా హారాన్ని రోజు మొత్తంలో ఉదయం పూట తినేవారు ఆరోగ్యంగా, బరువు పెరగకుండా ఉండడం లాస్ఎంజిల్స్ పరిశోధకుల గమనించారు. ఉదయం తినకుండా మధ్యాహ్నం బాగా తినే వారు బరువు పెరిగి.. ఏ పని చేయకుండా ఓపిక లేకుండా వారికి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం చూశారు. రాత్రి పూట అన్నం తినకుండా ఏవైనా చిరు పదార్థాలు, పండ్లు, ద్రవఆహారం తీసుకుంటే మరింత ఆరోగ్యంగా ఉంటారని పరిశోధకులు తేల్చారు. ఇలా అల్పాహారం ఉదయం పూట పుష్టుగా తినాలని.. మధ్యాహ్నం తక్కువగా అన్నం తినాలని పరిశోధకులు తేల్చారు.

To Top

Send this to a friend