పాత పద్దతినే ఫాలో అవుతున్న ‘డీజే’

గత కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీ నుండి ఏ సినిమా వచ్చినా కూడా ఆడియో వేడుక లేకుండా ప్రీ రిలీజ్‌ వేడుకలు అంటూ చేస్తున్నారు. ‘ఖైదీ నెం. 150’, ‘ధృవ’, ‘కాటమరాయుడు’, ‘మిస్టర్‌’ ఇలా పలు చిత్రాలకు సంబంధించిన పాటలు ఒక్కొక్కటి చొప్పున విడుదల చేసి సినిమా విడుదల ముందు ప్రీ రిలీజ్‌ వేడుకలు నిర్వహించారు. అల్లు అర్జున్‌ తాజాగా నటించిన ‘డీజే’ సినిమాకు కూడా అదే పద్దతిని ఫాలో అవుతారని అంతా భావించారు.

అంతా అనుకున్నట్లుగానే రెండు పాటలు విడుదల చేయడం జరిగింది. ఇతర పాటలు కూడా వారంకు ఒక్కటి చొప్పున విడుదల చేసి విడుదల వారం రోజులు ఉండగా ప్రీ రిలీజ్‌ వేడుక చేస్తారని మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ విశ్లేషకులు భావించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల 11న ‘డీజే’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు రెండు పాటలను మాత్రమే విడుదల చేయడం జరిగింది. మిగిలిన నాలుగు పాటలను ఆడియో విడుదల కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. మెగా హీరోలది ఒక దారి అయితే నాదో దారి అంటూ మొదటి నుండి చెప్పకనే చెబుతూ ఉండే అల్లు అర్జున్‌ తాజాగా ఈ విషయంతో దాన్ని మరోసారి నిరూపించాడు. అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘డీజే’ చిత్రం ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

To Top

Send this to a friend