`డిజె దువ్వాడ జ‌గ‌న్నాథమ్` డ‌బ్ స్మాష్ కాంటెస్ట్‌


స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై 25వ చిత్రంగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం `డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కులు, అభిమానుల నుండి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. విడుద‌లైన రెండు రోజుల్లోనే ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ 10 మిలియ‌న్ వ్యూస్‌ను రాబట్టుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. సినిమాపై మ‌రింత ఆస‌క్తిరేకెత్తించ‌డానికి చిత్ర నిర్మాత‌లు డ‌బ్ స్మాష్ కాంటెస్ట్‌ను కండెక్ట్ చేస్తున్నారు.

ఈ కాంటెస్ట్‌లో పాల్గొనాల‌నుకునేవారు డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ట్రైల‌ర్‌లోని డైలాగ్స్ డ‌బ్ స్మాష్ వీడియోల‌ను నిర్మాత దిల్‌రాజు అఫిసియ‌ల్ ఫేస్‌బుక్ పేజీకి కానీ లేదా ట్విట్ట‌ర్‌లో #DJDubSmashకు కానీ పంపాల్సి ఉంటుంది.

అలా పంపిన వీడియోస్‌లో ఐదుగురు విన్న‌ర్స్‌ను ఎంపిక చేసి వారికి స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ బ‌హుమ‌తులను అంద‌చేస్తారు. కాబ‌ట్టి న‌ట‌న‌తో త‌మ నైపుణ్యాన్ని చూపించుకుని బ‌న్నిని క‌ల‌వాల‌నుకునేవారికి ఇదొక స‌ద‌వ‌కాశం. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి అద్భుత‌మైన సంగీతాన్ని స‌మ‌కూర్చారు.

To Top

Send this to a friend