జూన్ 11న డీజే పాట‌ల విడుద‌ల వేడుక‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పవర్ఫుల్ ఎనర్జిటిక్ డైర‌క్ట‌ర్ హ‌రీష్‌ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు నిర్మిస్తున్న సినిమా `డీజే.. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోన్న 25వ సినిమా కావ‌డం విశేషం. రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాల త‌ర్వాత బ‌న్ని చేస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు ధీటుగా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌లైన రెండు రోజుల్లోనే 10 మిలియ‌న్స్ వ్యూస్‌తో ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంటుంది.

ఆర్య‌, ఆర్య‌2, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి ఇలా బ‌న్ని, రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. గ‌బ్బ‌ర్‌సింగ్ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్‌, దేవిశ్రీ ప్ర‌సాద్ క‌ల‌యిక‌లో రూపొందిన చిత్రం కూడా ఇదే. ఇలాంటి హిట్ కాంబినేష‌న్ క‌ల‌యిక‌లో డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ఆడియో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అల్రెడి సోషల్ మీడియాలో విడుద‌లైన రెండు పాట‌ల‌కు హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా పాట‌ల విడుద‌ల వేడుక‌ను జూన్ 11న గ్రాండ్ లెవ‌ల్లో నిర్వ‌హిస్తున్నారు. జూన్ 23న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు

To Top

Send this to a friend