మార్కెట్లో డిస్కౌంట్ల వాన కురుస్తోంది..

జీఎస్టీ వచ్చేస్తోంది.. చిరు వ్యాపారి నుంచి అంబానీల వరకు జీఎస్టీకి కిందకు రాక తప్పుదు.. ఈ నేపథ్యంలో సామాన్యుడి మాత్రం ఏం లాభం ఉండదు. ఎందుకంటే నిత్యవసరాలపై పన్ను లేకున్నా.. వ్యాపారులు తక్కువకు అమ్మే పరిస్థితి లేదు. లగ్జరీ వస్తువులపై 28శాతం పన్ను విధింపుతో అవి ఆకాశాన్ని అంటుతాయి. ఇలా జీఎస్టీ వల్ల సామాన్యులకు నష్టం తప్ప తక్షణ లాభం ఏమీ లేదు..

జీఎస్టీ ఎఫెక్ట్ తో మార్కెట్లో డిస్కౌంట్ల వాన వినియోగదారులను తడిసి ముద్ద చేస్తోంది. జూలై1 నుంచి జీఎస్టీ అమలు కానుండడంతో వస్త్రవ్యాపారులు, కార్లు, ఎల్ఈడీ, ఫ్రిజ్ లు, ఏసీలు, లక్షకు పైన బైక్ లు తదితర లగ్జరీ వస్తువులపై 30 నుంచి 40 శాతం డిస్కౌంట్ ను ప్రకటించారు. జనాలు ఇప్పుడు కూడా వాటిని దక్కించుకునేందుకు ఎగబడుతున్నారు.

ఏప్రిల్ 1 న కూడా ఇదే డిస్కౌంట్లు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశారు. బీఎస్4 అమ్మకాలు ఏప్రిల్ 1 నుంచి కొనసాగించాలని.. పాత వాహనాలను వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో మోటార్ వాహనాల కంపెనీలైన హోండా, హీరో, బజాజ్, టీవీఎస్ లు తమ వాహనాలపై 30-40 డిస్కౌంట్ ఇచ్చి మార్చి 31 అన్ని పాత వాహనాలను అమ్మేశాయి. ఇప్పుడూ అదే సీన్ రిపీట్ అవుతోంది.జిఎస్టీ ఎఫెక్ట్ తో ఇప్పటివరకు ఉన్న వస్తువులపై డిస్కౌంట్లు ఇస్తున్నారు. తమ వస్తువులను తక్కువకు అమ్ముకున్నా సరే కంపెనీలు, ఉత్పత్తి దారులే లాభపడతారు. జీఎస్టీ దెబ్బకు ప్రస్తుతం ఉన్న వస్తువుపై సరాసరి 20శాతం ధర పెరుగుతుంది. అంటే వినియోగదారుడు కొనలేడు. దీంతో వస్తువులు పేరుకుపోయి నష్టం వస్తుంది. అదే వస్తువును డిస్కౌంట్ కు అమ్మినా కంపెనీకి నష్టం ఉండదు..ఇలా జీఎస్టీతో ధరలు పెరిగే అన్ని వస్తువులపై డిస్కౌంట్ లు ఇస్తూ సామాన్యులను వ్యాపారులు ఆకట్టుకుంటున్నారు.

జీఎస్టీ ముప్పునుంచి పాత వస్తువులను తప్పించుకోవడానికి ధర పెరిగే అన్ని వస్తువులను ఎలాగోలా తక్కువకు అయినా అమ్మి వదిలించుకోవాలని ఉత్పత్తి దారులు దేశవ్యాప్తంగా ఇప్పుడు డిస్కౌంట్ లు ప్రకటించారు. తమ ప్రోడక్ట్ అమ్మితే చాలు లాభం కొద్దిగా అయినా పర్లేదు అనుకుంటున్నారు.

To Top

Send this to a friend