దిల్ రాజు-పవన్ జోడీగా సినిమా

ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన క్రేజే వేరు.. మరొకరు స్టార్ ప్రొడ్యుసర్ దిల్ రాజు.. టాలెంట్ ను గుర్తించి మంచి కథలతో నూతన దర్శకులతో సినిమాలు తీస్తూ వరుస హిట్ లు కొడుతున్నాడు.. వీరిద్దరూ జోడి కడితే ఏమైనా ఉందా.. కానీ ఉంది.. దిల్ రాజుతో సినిమా చేయడానికి పవన్ ఒప్పుకున్నాడు.. టాలీవుడ్ లో క్రేజీ హీరోలందరితో సినిమాలు చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒక్క పవన్ తో మాత్రం ఇప్పటివరకు సినిమా తీయలేదు. ఇప్పుడా చాన్స్ తనకు వచ్చిందని తాజాగా పేర్కొన్నారు..

దసరా తర్వాత పాలిటిక్స్ లోకి రావాలని పవన్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాను వేగంగా కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే తన పార్టీ జనసేన తరపున నాయకుల రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా ముగియగానే దసరా లోపు మైత్రీ మూవీస్ సినిమాలో నటిస్తున్నారు. దాన్ని దసరాలోపే పూర్తి చేసి తరువాత ఏపీ పాలిటిక్స్ లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు వస్తారని సమాచారం. మధ్యలో ఏఏం రత్నంతో కూడా సినిమా తీయాల్సి ఉన్నా పవన్ రాజకీయాల్లో బిజీగా మారితే సినిమా పట్టాలెక్కడం కష్టం.. ఈ నేపథ్యంలో దిల్ రాజు మూవీ 2019 ఎన్నికలు ముగిశాక ఉంటుంది.

దిల్ రాజు ప్రొడక్షన్ లో పనిచేసిన ఓ దర్శకుడు చెప్పిన కథ విని.. దాన్ని పవన్ కు చెప్పడానికి దిల్ రాజు త్రివిక్రమ్ చేస్తున్న సినిమా స్పాట్ కు వెళ్లాడు. అక్కడ పవన్ తో సినిమా విషయమై చర్చించారని తెలిసింది. దీనికి పవన్.. మంచి కథతో వస్తే సినిమా చేసేందుకు తాను రెడీ అని దిల్ రాజుతో అన్నారట.. దీంతో కథకు మెరుగులు దిద్ది తీసుకొస్తామని చెప్పినట్టు సమాచారం. వీరిద్దరి సినిమా 2019 ఎన్నికల తర్వాతే ఉండనుంది.

To Top

Send this to a friend