‘ఫిదా’ను కూడా గెలికేసిన దిల్‌రాజు

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతల్లో దిల్‌రాజు ముందుంటాడు. ఒక మంచి కథను ఎంచుకోవడం, ఆ కథకు, హీరో, దర్శకుడును బట్టి బడ్జెట్‌ను కేటాయించి సినిమాలు నిర్మించడం దిల్‌రాజుకే చెల్లింది. దిల్‌రాజు నిర్మించిన దాదాపు 90 శాతం సినిమాలు లాభాలను సాధించినవే. తాజాగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా దిల్‌రాజు ఒక చిత్రాన్ని నిర్మించాడు. భారీ అంచనాలున్న ఈ సినిమాను ఈనెల 21న విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు. అన్ని సిద్దం అవుతున్న సమయంలో దర్శకుడికి దిల్‌రాజు షాక్‌ ఇచ్చాడు.

సినిమాలోని రెండు కీలక సన్నివేశాు సరిగా రాలేదని, వాటి వల్ల ఖచ్చితంగా సినిమాపై ప్రభావం పడుతుందని, అందుకే వాటిని రీ షూట్‌ చేయాల్సిందే అంటూ చెప్పాడు. దిల్‌రాజు అంటే గౌరవంతో పాటు, ఆయన చెబితే అది మార్చాల్సిందే, ఆయన చెప్పేదాంట్లో అర్థం ఉంటుందని శేఖర్‌ కమ్ముల ఫిక్స్‌ అయ్యి ‘ఫిదా’ రీ షూట్‌కు సిద్దం అయ్యారు. వారం రోజుల పాటు రీ షూట్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. రీ షూట్‌ కారణంగా సినిమా ఆలస్యం కాకుండా ప్లాన్‌ చేస్తున్నారు.

‘మిస్టర్‌’ చిత్రంతో వరుణ్‌ తేజ్‌ భారీ డిజాస్టర్‌ను అందుకున్నాడు. దాంతో ఈ సినిమా ఖచ్చితంగా వరుణ్‌కు భారీ విజయాన్ని ఇవ్వాలి. మొదటి నుండి కూడా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని శేఖర్‌ కమ్ముల తెరకెక్కించాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

To Top

Send this to a friend