పవన్‌ ఫ్యాన్స్‌పై దిల్‌రాజు ఫైర్‌


అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘డీజే’ చిత్రంకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. అయినా కూడా ఈ చిత్రం మొదటి వారంలోనే వంద కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేసి సత్తా చాటింది. తాజాగా ఈ చిత్రం థ్యాంక్స్‌ మీట్‌లో దిల్‌రాజు మాట్లాడుతూ తమ సినిమా సక్సెస్‌ను ఓర్వలేక, వస్తున్న కలెక్షన్స్‌ను చూసి భరించలేక సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

దిల్‌రాజు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించాడు. దిల్‌రాజు బ్యానర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కిన డీజే ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది అనే మాట వాస్తవం. అంచనాలను అందుకోలేక పోయిన డీజే ఒక రొటీన్‌ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. అయినా కూడా మంచి కలెక్షన్స్‌ వచ్చాయి. అయినా కూడా దిల్‌రాజు ఓర్వలేక పోతున్నారు అంటూ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు.

అల్లు అర్జున్‌పై ఉన్న కోపంతో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ బ్యాడ్‌ టాక్‌ వచ్చేలా పబ్లిసిటీ చేశారు. సోషల్‌ మీడియాలో వారు చేస్తున్న ప్రచారం వల్ల కలెక్షన్స్‌ చాలా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. వారికి ఇది మంచిది కాదని, ఒక మంచి సినిమాను నాశనం చేసేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారంటూ పవన్‌ ఫ్యాన్స్‌పై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

To Top

Send this to a friend