దిల్ రాజును మెప్పించాడు..

 

స్వీట్ లవ్ స్టోరీలకు పెట్టింది పేరైన శేఖర్ కమ్ముల నుంచి మరో లవ్ స్టోరీ వచ్చింది. ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘ఫిదా’. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. తెలంగాణ అమ్మాయికి, అమెరికా అబ్బాయికి మధ్య కుదిరే ప్రేమను వెండితెరపై శేఖర్ కమ్ముల అద్భుతంగా తెరకెక్కించాడు.. ఆద్యంతం పల్లెటూరులో, అమెరికాలో సాగిన ఈ ప్రేమకథలో హీరోయిన్ సాయి పల్లవి చెలాకీ నటనతో ఆకట్టుకుంది. నూతన సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీన్ ఈ సినిమాకు సంగీతం సినిమాకు హైలెట్ గా నిలిచింది..

శేఖర్ కమ్ముల చిత్రంలో భారీ డైలాగులు , ఫైట్లు ఉండవు. సహజ సిద్ధంగా మనం ఇంట్లో ఏం మాట్లాడుతామో.. ఎలా ప్రవర్తిస్తామో అలాగే ఉంటది. ఇందులోనూ అదే మ్యాజిక్ చూపించాడు.. హీరోయిన్ తో తెలంగాణ యాసను చెలాకీగా పలికించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. హీరోయిన్ ఎక్స్ ప్రెషన్, దూకుడు ట్రైలర్ లో ఆకట్టుకుంది. హీరో వరుణ్ తేజ్ లవర్ బాయ్ గా ఇందులో కనిపించారు.

ట్రైలర్ చూస్తే ఒక గడుసు అమ్మాయికి.. ఓ మొండి అబ్బాయికి మధ్య నడిచిన ప్రేమగా కనిపిస్తోంది.. సీన్లు మాత్రం బాగా రిచ్ గా కనిపిస్తున్నాయి. దిల్ రాజు మామాలుగా సాధారణ కథలకు ఓకే చెప్పడు. ఆయన ఓకే చేసి సినిమా నిర్మిస్తున్నాడంటే అందులో విషయం ఉన్నట్టే లెక్క. మరి దిల్ రాజును మెప్పించిన శేఖర్ కమ్ముల.. ప్రేక్షకులను మెప్పిస్తాడా అన్నది వేచిచూడాల్సిందే..

ఫిదా ట్రైలర్ ను కింద లింక్ లో చూడొచ్చు.

To Top

Send this to a friend