సినిమాలకు దిల్ రాజు గుడ్ బై..

ఈరోజు ఓ ఆంగ్ల అగ్ర వెబ్ సైట్ వేసిన వార్త టాలీవుడ్ లో సంచలనమైంది. దిల్ రాజు గురించి రాసిన వార్త హాట్ టాపిక్ గా మారింది. ఆ వార్తలో ఏముందంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సక్సెస్ ఫుల్ నిర్మాత అయిన దిల్ రాజు ఇటీవల ఫిదా సినిమా సంబరాలను నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. దీనికి టీఆర్ఎస్ మంత్రి పోచారం, నిజామాబాద్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అప్పుడే ఓ విషయం చోటుచేసుకున్నట్టు తెలిసింది. దిల్ రాజును టీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించాడట.. అయిత అంతకుముందే సీఎం కేసీఆర్ నుంచి ఈ ఆఫర్ తనకు వచ్చిందని దిల్ రాజు సదురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెప్పినట్టు సమాచారం.

తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతం నుంచి వచ్చిన దిల్ రాజు సినిమారంగంలో అంచెలంచెలుగా ఎదిగాడు. మొదట డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రస్తుతం నిర్మాతగా టాలీవుడ్ నే ఏలుతున్నాడు. అతడు పట్టిందల్లా బంగారమవుతోంది. ప్రస్తుతం వరుస హిట్లతో నంబర్ 1 నిర్మాతగా దూసుకుపోతున్నాడు. స్వతహాగా తెలంగాణ వాది కావడంతో దిల్ రాజు కు టీఆర్ఎస్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలిసింది..

తెలంగాణ సీఎం కేసీఆర్ కు, నిర్మాత దిల్ రాజుకు మాంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఇటీవలే విడుదలైన ఫిదా సినిమాను ఇటీవల కేసీఆర్ కు ప్రత్యేకంగా చూపించి మెప్పించాడు దిల్ రాజు. ఈ సందర్భంగానే దిల్ రాజుకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడట సీఎం కేసీఆర్.. తెలంగాణ సినిమాలను ప్రమోట్ చేస్తూ తెలంగాణ భాషను, సంస్కృతిని ఎలుగెత్తి చాటడంలో నిర్మాత దిత్ రాజు కృషికి మెచ్చి కేసీఆర్ జహీరాబాద్ ఎంపీ సీటును టీఆర్ఎస్ తరఫున ఆఫర్ చేసినట్టు సమాచారం. దీనికి దిల్ రాజు కూడా సానుకూలంగా స్పందించడంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి దిల్ రాజు ఎంపీగా రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనమైంది.

To Top

Send this to a friend