కేటీఆర్ కు డ్రగ్స్ లింకులు

 

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఢిల్లీ లో ఉంటూ తెలంగాణ ప్రభుత్వంపై వరుస ట్వీట్లతో బెంబేలెత్తిస్తున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణలో వెలుగుచూసిన మియాపూర్ కుంభకోణంలో టీఆర్ఎస్ మంత్రుల పాత్ర ఉందని.. దమ్ముంటే వారిని అరెస్ట్ చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్ విసిరిన దిగ్విజయ్ మరో సారి ట్విట్టర్ వేదిక రెచ్చిపోయారు..

ఈసారి డిగ్గీ రాజా పరోక్షం టీఆర్ఎస్ నేతలను.. అందునా సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్న టీఆర్ఎస్ మంత్రులను టార్గెట్ చేసి డ్రగ్స్ తీసుకుంటున్నారని.. ముందు వారిని విచారించాలని ట్వీట్ చేయడం దుమారం రేగింది. ఇది పరోక్షంగా మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి చేసిందనే ప్రచారం జరగడంతో ఇక నేరుగా కేటీఆర్ రంగంలోకి దిగారు..

కేటీఆర్ .. దిగ్విజయ్ కు ట్వీట్ తో సమాధానమిచ్చారు. ‘‘మీరిప్పుడు ఎక్కడా లేరు.. సంపూర్ణంగా ఓడిపోయారు.. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం.. వయసుకు తగ్గ పనులు చూసుకుంటే మంచిది. అంటూ ’ పరోక్షంగా ముసలోడివి అయిపోయావ్.. నోర్మూసుకో అని అర్థం వచ్చేలా దిగ్విజయ్ పై కేటీఆర్ సెటైర్ వేయడం సంచలనం రేపింది. ఇక అంతేకాదు.. ఈ సారైనా ‘తెలంగాణ’ అనే పదాన్ని సరిగ్గా వాడినందుకు సంతోషం అంటూ మరోసారి కేటీఆర్ దిగ్విజయ్ కు చురకలు అంటించారు.

ఇలా దిగ్విజయ్ సింగ్ తెలంగాణ ప్రభుత్వంపై, టీఆర్ఎస్ పై వరుసగా ట్వీట్ల యుద్ధం చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా.. ఈసారి కేటీఆర్ మాంచి కౌంటరే ఇచ్చి సమాధానమిచ్చారు.

To Top

Send this to a friend