దిగ్గజ దర్శకుడిని తాగుబోతుని చేశారు..


జంధ్యాల.. అసలు సిసలు తేట తెలుగు కామెడీకి చిరునామా.. తెలుగు సినిమా చరిత్రలో చాలా పద్ధతిగా.. హుందాగా ఆరోగ్యకరమైన హాస్యం అందించింది జంధ్యాలనే.. ఇప్పటి జబర్దస్త్ లు.. సినిమాలోని కామెడీ అంతా అరువు తెచ్చిందో.. లేక వేరేవారిని కొట్టడం వల్లో.. ఏడిపించడం వల్లో బూతు మాటలు చెప్పడం వల్లో పుడుతోంది. కానీ జంధ్యాల ఆకాలంలోనే అందమైన కామెడీని చూపించారు. బ్రహ్మానందం లాంటి వాళ్లను తెలుగు చలన చిత్ర రంగ ప్రవేశం చేయించి ఇప్పుడు ఆయన ఎదుగుదలకు ఎంతో తోడ్పాటు నందించారు..

అలాంటి జంధ్యాలను బ్రహ్మానందం దారుణంగా అవమానించారు. గురువు అన్న సంగతి భయం, భక్తి లేకుండా ఆయన మరణంపై వివాదాస్పద వ్యాఖ్య చేశారు. పైగా దీనికి హోస్ట్ చిరంజీవి కూడా పదం కలపడంతో ఈ వివాదం రాజుకుంది..

చిరంజీవి నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు బుల్లితెర ప్రోగ్రాంకు బ్రహ్మానందం ఇటీవల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో బ్రహ్మానందం -చిరంజీవి మధ్య హాస్య సినిమాల చర్చ వచ్చినప్పుడు బ్రహ్మానందం తన గురువైన జంధ్యాలను గురించి మాటలు తూలారు. విపరీతంగా తాగడం వల్ల జంధ్యాల చనిపోయాడని.. తాగిన తర్వాత జంధ్యాల ఎలా వ్యవహరించాడో.. ఎలా తాగేవాడో షోలో చేసి చూపించారు. దీనికి చిరంజీవి కూడా కొన్ని ఉదాహరణలు చెబుతూ జంధ్యాలను అవమానించారు..

తెలుగులోనే గొప్ప దర్శకుడు.. ఆయన సినిమాలన్నీ ఆణిముత్యాలే.. అంతటి గొప్ప దర్శకుడి ప్రతిభను కొనియాడాల్సింది పోయి.. ఆయన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి చిరంజీవి,బ్రాహ్మానందం పెద్ద తప్పు చేశారు. ఈ ప్రోగ్రాం ప్రసారం కావడంతో జంధ్యాల భార్య, కుమారులు చూసి బ్రహ్మానందం, చిరంజీవిలకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సారీ చెప్పి ఊరుకున్నారట..

To Top

Send this to a friend