నంద్యాలలో టీడీపీ భయపెట్టే గెలిచిందా.?

నంద్యాలలో టీడీపీ ఘనవిజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందారెడ్డి 27వేల ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై విజయం సాధించారు. అయితే అధికార బలంతో టీడీపీ… పోలీసులు, అధికారులను అడ్డం పెట్టుకొని గెలిచిందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నంద్యాలలో క్షేత్రస్థాయిలో టీడీపీ రౌడీలను ఏర్పాటు చేసుకుందని.. కొందరు టీడీపీ నేతలు పెద్ద కుటుంబాలకు భారీ నజరానాలు ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని కుటుంబాలకు అయితే బైక్ లు కూడా గిఫ్ట్ లు ఇచ్చారని సమాచారం. ఇవన్నీ చేయడం వల్లే టీడీపీ గెలించిందనే ప్రచారం జరుగుతోంది..

ఇలా నంద్యాలలో అభివృద్ధి పేరుతో టీడీపీ భయపెట్టి గెలిచిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ నేతల్లో మాత్రం నైరాశ్యం అలుముకుంది. ఎందుకంటే దాదాపు 12 రోజుల పాటు వైసీపీ అధినేత జగన్ నంద్యాలలోనే మకాం వేసి ప్రచారం చేసినా టీడీపీకి జనం పట్టంకట్టడంతో దీన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోవడం లేదట.. ఇలా నంద్యాల ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు, వైసీపీ ఓటమికి మధ్య ప్రలోభాలే పనిచేశాయని అర్థమవుతోంది.

To Top

Send this to a friend