ఎన్టీఆర్‌ స్క్రిప్ట్‌ దొంగ : టాప్‌ డైరెక్టర్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమాలోని జై పాత్రకు సంబంధించిన టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. టీజర్‌కు అనూహ్యమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఏకంగా కోటికిపైగా వ్యూస్‌ అతి తక్కువ సమయంలోనే వచ్చాయి. ఆ జోష్‌తో సినిమాను పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సమయంలో చిత్రంపై ఒక ఇంగ్లీష్‌ దిన పత్రిక వివాదాస్పద కామెంట్స్‌ చేస్తూ, ఒక కథనంను ప్రచురించడం జరిగింది.

‘జై లవకుశ’ చిత్రంలోని జై పాత్ర నేపథ్యంను ఎన్టీఆర్‌ దొంగిలించాడని, ‘టెంపర్‌’ చిత్రం సమయంలో ఎన్టీఆర్‌కు ఒక పవర్‌ ఫుల్‌ విలన్‌ పాత్రను దర్శకుడు పూరి జగన్నాధ్‌ చెప్పడం జరిగిందట. ఆ విలన్‌ పాత్రను బేస్‌ చేసుకుని కథను అల్లబోతున్నట్లుగా ఎన్టీఆర్‌కు చెప్పడం, ఆ విలన్‌ పాత్రను మీరు చేయాలని ఎన్టీఆర్‌కు చెప్పడం జరిగిందట. పూరి ఆ స్టోరీ ఐడియాను ఎన్టీఆర్‌కు చెప్పగా, ఎన్టీఆర్‌ దర్శకుడు బాబీకి చెప్పడం దాని ప్రకారంగానే జై పాత్రను డిజైన్‌ చేశారు అంటూ సదరు ఇంగ్లీష్‌ పత్రిక కథనంలో పేర్కొనడం జరిగింది.

పూరి జగన్నాధ్‌కు ఎన్టీఆర్‌కు సన్నిహిత సంబంధాలుంటాయి. ఆ సన్నిహిత సంబంధాల కారణంగా పూరి ఈ విషయమై బయటకు స్పందించలేక సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడు. దాంతో వారు మీడియాకు ఉప్పందించడం జరిగిందని, మీడియాలో ఈ విషయం ప్రచురితం కావడం జరిగింది. ఈ విషయమై ‘జై లవకుశ’ చిత్ర యూనిట్‌ సభ్యులు ఎలా రియాక్ట్‌ అవుతారు అనేది చూడాలి.

To Top

Send this to a friend