తాను దొంగను అని ఒప్పుకున్నాడా?

 

ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘జై లవకుశ’ చిత్రంలోని జై పాత్ర పూరి ఐడియా అని, ‘టెంపర్‌’ చిత్రం షూటింగ్‌ సమయంలో ఎన్టీఆర్‌కు పూరి జగన్నాధ్‌ ఆ పాత్రకు సంబంధించిన ఐడియాను చెప్పడం జరిగింది. ఆ ఐడియాతోనే జై పాత్రను దర్శకుడు బాబీకి సూచించడం, ఆయన జై లవకుశ పాత్ర కోసం జై పాత్రను సిద్దం చేయడం జరిగింది. ఈ విషయం ఒక ఆంగ్ల పత్రికలో రావడంతో సోషల్‌ మీడియాలో చర్చ తారా స్థాయిలో జరుగుతుంది.

జై పాత్రకు సంబంధించిన ఐడియా నిజంగా దర్శకుడు బాబీది అయితే సదరు దినపత్రికపై ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు కేసు నమోదు చేయడం లేదా మరేదైనా చర్యు తీసుకోవడం జరిగేది. కాని పక్కాగా అది పూరి ఐడియానే అని తేలిపోయింది. దానికి తోడు చిత్ర యూనిట్‌ సభ్యులు పూరి జగన్నాధ్‌తో మాట్లాడి సెటిల్‌మెంట్‌ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడితే ఈ వివాదం సమసి పోయేట్లుగా మీడియా ప్రకటన చేయాల్సిందిగా పూరిని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌కు చెందిన వారు ఒప్పించినట్లుగా సమాచారం.

పూరితో సెటిల్‌మెంట్‌ చేసుకోవడం వల్ల ఎన్టీఆర్‌ తన తప్పును ఒప్పుకున్నట్లయ్యింది అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఇలా ఐడియాలను దొంగిలించడంపై కొందరు సీనియర్‌ దర్శకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శకులు ఎంతో మంది ఎన్నో కథలు హీరోలకు చెబుతూ ఉంటారు. ఆ కథలు వేరే దర్శకుల వద్ద చర్చించడం, ఆ కథలోని పాయింట్లను తీసుకోవడం ఏమాత్రం సమంజసం కాదు అంటూ కొత్త దర్శకులు అంటున్నారు.

To Top

Send this to a friend