ద్యేవుడా.. పవన్ ను పాలిట్రిక్స్ లోకి రానీయకు..


పవన్ పొలిటికల్ ఎంట్రీ ఆయన ప్రత్యర్థులను భయాందోళనకు గురిచేస్తోంది. టీడీపీ అండ్ ఆయనకు సన్నిహితంగా ఉండే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రతి వారాంతం రాసే కొత్త పలుకు శీర్షికలో ఇదే విషయాన్ని అంతర్గతంగా వెల్లడించారు. చంద్రబాబు, కేసీఆర్ లో ఉన్న రాజనీతి పవన్ లో లేదని.. పవన్ పొలిటికల్ ఎంట్రీ కంటే విజిల్ బ్లోయర్ గా ఉంటేనే నయమనే ప్రచారం చేశారు. అంతేకాదు.. పొరపాటున రాజకీయాల్లోకి వచ్చి  కేజ్రీవాల్ పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. కేజ్రీవాల్ కు ఇప్పుడు ఏ గతి పట్టిందో అర్థం చేసుకోవాలని ఉదాహరణలు చెప్పేశారు..

ఒక్కటి మాత్రం నిజం.. చంద్రబాబు అండ్ కో పవన్ ను చూసి భయపడుతున్నారు. పవన్ రాజకీయ ఎంట్రీతో కాపులతో సహా చాలా వర్గాలు, టీడీపీతో ఉన్నవారు ఆయనకు మద్దతుగా నిలుస్తారు. ఈ పరిణామాలతో టీడీపీ ఓటు బ్యాంకుకు గండిపడుతుంది. నాడు ప్రజారాజ్యం పార్టీతో 19శాతం ఓట్లను సాధించిన చిరంజీవి వల్లే 2009 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారు. నేడు 2019 ఎన్నికల్లో పవన్ వల్లే చంద్రబాబుకు ఎఫెక్ట్ అవుతుందని టీడీపీ శిబిరం భయపడుతోంది.. ఈ విషయంలో వైఎస్ జగన్ కు కొంత లాభమే.. ఆయన ఓటు బ్యాంకుకు పవన్ గండికొట్టే అవకాశాలు లేవు. రెడ్డి, ముస్లిం, మైనార్టీలు, బీసీలు వైసీపీకి అండగా ఉన్నారు. ఎఫెక్ట్ ఏదైనా ఉందంటే అది టీడీపీకేనని రాజకీయ పండితులు చెబుతున్నారు.

ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. వైసీపీతో పాటు జనసేన వల్ల ఓట్ల చీలిక సాధ్యమవుతుంది. ఇది అంతిమంగా టీడీపీకే చేటు. అందుకే పవన్ రాజకీయాల్లోకి వచ్చే కంటే విజిల్ బ్లోయర్ గా ఉంటూ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చే పాత్రకే పరిమితం కావాలని లేకపోతే కేజ్రీవాల్ లా ఎగిసి మసకబారిపోతావంటూ టీడీపీ కోటరీ ప్రచారం మొదలు పెట్టింది. పవన్ ఎంట్రీ ఖాయం కావడంతో టీడీపీ ఆయన్ను రాకుండా చేసే కుట్రలో భాగంగానే ఈ ప్రచారం చేస్తున్నారని జనసేన పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ జనసేనాని ఎంట్రీ ఖాయమనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు.

To Top

Send this to a friend