దేవీశ్రీ ప్రసాద్ గురుదక్షిణ..

DSP.. దేవీ శ్రీ ప్రసాద్.. ఇప్పుడు రాక్ స్టార్ గా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్నాడు. ఇలాంటి దేవీ తను ఎంత ఎత్తుకు ఎదిగినా తనకు బతుకునిచ్చిన.. ఓనమాలు నేర్పిన గురువును మాత్రం మరిచిపోలేదు.. గురుపౌర్ణమి సందర్భంగా తన గురువుగా భావించే ప్రముఖ కంపోజర్ మాండొలిన్ శ్రీనివాస్ ను దేవీశ్రీ ప్రసాద్ స్మరించుకున్నారు. ఆయన కోసం స్పెషల్ వీడియోను రూపొందించారు. మంచి పాటను కంపోజ్ చేసి ఆ వీడియోలో శ్రీనివాస్ చిన్ననాటి ఫొటోలను చూపాడు.

సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ *దేవీ’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత సంగీత ప్రతిభతో ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు దక్షిణాదిలో అన్ని భాషల్లో దేవీ సంగీతం అందిస్తున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు.

అయితే దేవీశ్రీ ప్రసాద్ సంగీతం నేర్చుకున్నది ప్రఖ్యాత సంగీత దర్శకుడు మాండలోన్ శ్రీనివాస్ వద్దే.. శ్రీనివాస్ వద్ద మాండలోన్ , సంగీతంలో ఓనమాలు దిద్దాడు. శిక్షణ పొందాడు. ఆ తర్వాత సొంతప్రతిభతో దక్షిణాదిలో ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగారు.

దేవీశ్రీ తన గురువుకు ఇచ్చిన ఈ గురుదక్షిణ వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend