సోషల్‌ మీడియా మరీ దిగజారుతుంది


ప్రస్తుతం సోషల్‌ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రెటీలకు సంబంధించిన చిన్న వార్తల అయినా కూడా సోషల్‌ మీడియాలో దావానంలా వ్యాప్తి చెందుతుంది. తాజాగా మంచు మనోజ్‌ ఉదంతంను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జోక్‌గా ఆయన చేసిన పోస్ట్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తాజాగా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి యాక్సిడెంట్‌కు గురయ్యాడు అంటూ మీడియాలో తారా స్థాయిలో ప్రచారం జరిగింది.

మీడియాలో వచ్చిన వార్తలకు అంతా షాక్‌ అయ్యారు. ఇటీవలే ‘అమీతుమీ’ చిత్రంను తెరకెక్కించి సక్సెస్‌ను అందుకున్న దర్శకుడు ఇంద్రగంటికి ఇలా కావడం విచారకరం అంటూ కొందరు సానుభూతి కూడా వ్యక్తం చేశారు. అయితే తాజాగా తన యాక్సిడెంట్‌ వార్తల గురించి దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి స్పందిస్తూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. తనకు యాక్సిడెంట్‌ అయిన విషయం నిజమే కాని, ఇప్పుడు కాదు అని, సంవత్సరంకు పైగా అయ్యిందంటూ బాంబు పేల్చాడు.

తాను నానితో ‘జెంటిల్‌మన్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సమయంలో యాక్సిడెంట్‌ అయ్యిందని, అప్పుడు ఎలాంటి గాయాలు లేకండా బయట పడ్డాను అని, అయితే ఇప్పుడు సోషల్‌ మీడియాలో మరోసారి తనకు యాక్సిడెంట్‌ చేసి అంతా కూడా షాక్‌ ఇచ్చారని, అప్పుడు గాయాలు కాకున్నా ఈసారి గాయాలు ఎక్కువ అయ్యాయి అంటూ వార్తలు రావడం హాస్యాస్పందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఒక వార్త ప్రచురించే సమయంలో కాస్త వెనుక ముందు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ వార్తను తాజాగా కవర్‌ చేయడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.

To Top

Send this to a friend