దేశాన్ని ముక్కలు చేస్తారా.?


గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిజంగా లౌకిక రాజ్యం నడిచింది. అప్పుడు బీజేపీకి పెద్దగా బలం లేదు. దీంతో దేశంలో వర్ణ, మత, వర్గ విభేదాలు పొడచూపలేదు. గోవుమాంస నిషేధం.. ముస్లింలపై, దళితులపై దాడులు జరగలేదు. ఎవరి మానాన వారు పనిచేసుకుంటూ జీవించారు.. కానీ బీజేపీ గద్దెనెక్కగానే ఏం జరిగింది. ఏం జరగబోతోంది.

కాంగ్రెస్ అధికారంలో ఉండగా చచ్చిన పాములా ఉన్నా ఆర్ఎస్ఎస్ బీజేపీ గద్దెనెక్కడంతో జడలు విప్పింది. దేశవ్యాప్తంగా హిందుత్వ ఎజెండాను బీజేపీ ప్రోద్బలంతో అమలుచేస్తోంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు అల్పసంఖ్యాక వర్గాలు, మైనార్టీలపై వివక్ష చూపిస్తున్నారు. మాటల్తో చేతల్తో విసిగిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో వరుసగా దాడులు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఆర్ఎస్ఎస్ ప్రోద్బలంతో జరుగుతున్న ఈ వివాదాలు బీజేపీకి మాయని మచ్చని తెస్తున్నాయి. ఇటీవల కూడా దక్షిణాది రాష్ట్రాల ప్రజలపై బీజేపీ నేత తరుణ్ విజయ్ చేసిన విద్వేష వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. దీనిపై పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ పెద్ద యుద్ధమే చేసింది. గందరగోళం సృష్టించింది. కాంగ్రెస్ సభ్యులంతా లేచి నిలబడి తరుణ్ విజయ్ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ నినాదాలు చేశారు. తరుణ్ పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని.. అంతవరకు పార్లమెంటును జరగనీయమని కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశఆన్ని ముక్కలు చేస్తారా అని ప్రశ్నించారు. దక్షిణాది ప్రజలు దేశంలో భాగం కాదా..? అని మండిపడ్డారు. బీజేపీ ఉత్తరాది పార్టీనా అని ప్రశ్నించారు.

ఒక్కటి మాత్రం నిజం.. బీజేపీ గద్దెనెక్కగానే దేశంలో హిందుత్వ భావజాలం పెచ్చరిల్లుతోంది. మఠంలో ఉండాల్సిన స్వామీజీలు జనంలోకి వచ్చి హిందుత్వ ప్రచారం చేస్తున్నారు. తాము తయారు చేసిన వస్తువలను అమ్ముకుంటున్నారు. ఇదంతా మోడీ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే జరుగుతుందనేది కాదనలేని సత్యం.. తేడా వస్తే అనుభవించేది కూడా ఆయన అన్న విషయం ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం.. మోడీ ప్రభుత్వం హిందుత్వ ఎజెండా చూశాక.. దేశప్రజలందరిలో ఒక్కటే ఆలోచన.. గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వ లౌకిక విధానమే బాగుందనే సందేహం కలుగకమానదు..

To Top

Send this to a friend