దేశ జవాన్లకు అవమానం..


దేశం అట్టుడుకుతోంది.. జవాన్లకు జరిగిన ఈ అవమానం చూశాక.. అందరి కడుపు రగిలిపోతోంది. కాశ్మీర్ లో భారత సైన్యానికి ఎంత అవమానం జరుగుతుందో తేటతెల్లమైంది. ఇన్నాళ్లు కాశ్మీర్ లో భారత సైన్యమే మానవ హక్కుల ఉల్లంఘానికి పాల్పడుతోందని పాకిస్తాన్ ఆరోపించేది. దేశంలోని కొందరు ముస్లింలు కూడా దీన్నే ప్రస్తావించారు. కానీ శుక్రవారం ఎన్నికల విధుల్లో పాల్గొన్న భారత సైనికుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన కాశ్మీర్ యువకుల చేష్టలు చూశాక.. భారత సైన్యం చేసేది కరెక్ట్ అనిపిస్తోంది..

ఎన్నికల విధుల్లో పాల్గొన్న భారత సైనికులను కొందరు అతివాద యువకులు కొట్టడం.. తన్నడం.. ఎన్నికల సామాగ్రి లాక్కోవడం.. కిందపడేసి తన్నడం చేశారు. చేతిలో గన్ను ఉన్న కూడా మన సైనికులు ఎక్కడా అదుపుతప్పలేదు. ఆ యువకులపై తిరగబడలేదు. గన్ను ఎత్తలేదు. సైలెంట్గా వెళ్లిపోయారు. ఈ వీడియో చూశాక.. సైనికులకు జరిగిన అవమానంపై దేశవ్యాప్తంగా సానుభూతి వ్యక్తం అవుతోంది.

To Top

Send this to a friend