నో బీజేపీ.. ఢిల్లీ ప్రజలు ‘ఆమ్ ఆద్మీ’ వైపే..

ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇక ముగిసిపోయిందనుకున్నాం.. ఢిల్లీలో బీజేపీని మట్టికరిపించిన ఈ పార్టీ ఆ తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లో చతికిలపడింది. ఢిల్లీలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో కూడా బీజేపీ చేతిలో ఓడిపోయింది. ఒక ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాల్లో కూడా పోటీచేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి చవిచూసింది. దీంతో ఆపార్టీ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో మరోసారి తన ఉనికిని చాటింది..

దిల్లీలోని బవానా శాసనసభ నియోజకపర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి రాంచందర్ 24 వేలకు పైగా ఓట్లతో భారీ విజయాన్ని సాధించాడు. సమీప బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించాడు. ఈ విజయంతో దిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ వెంటే ఉన్నారని మరోసారి రుజువైంది.

కొద్దిరోజులుగా దేశంలో బీజేపీ హవా నడుస్తోంది. అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. కానీ ఢిల్లీలో మసకబారిన ఆమ్ ఆద్మీకి ఈ విజయం ఊపిరిపోసింది.

To Top

Send this to a friend