దాసరి ‘ఉదయం’

తెలుగు సినిమా గర్వించే దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు అస్తమించించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న దాసరి నిష్క్రమణ తెలుగు సినిమా చరిత్రలో ఓ విషాదాంతం.. దాసరి సినిమా దర్శకుడుగా, నిర్మాతగానే కాదు.. రాజకీయాల్లోనూ తన దైన శైలిలో దూసుకుపోయాడు. నాడు కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో ప్రస్థానం మొదలు పెట్టాడు..

 

అప్పటి వరకు ఏకచత్రాధిపత్యంగా ఏపీలో కొనసాగుతున్న ఈనాడు దినపత్రికకు పోటీగా ఉదయం పత్రికను దాసరి స్థాపించారు. అనంతరం నిర్వహణ, ఆర్థిక భారంతో వదిలేశారు. దాసరి ఉదయం పత్రిక జర్నలిజానికి ఓ దశను, ఓ దిశను చూపించింది. పరిశోధనాత్మక కథనాలతో తెలుగునాట సంచలనం సృష్టించింది. ఈనాడుకు ముచ్చెమటలు పుట్టించింది. అందుకే ఈనాడు అధినేత రామోజీరావు ఈ పత్రిక మూసివేసే వరకు నిద్రపోలేదని ఎందరో జర్నలిస్టులు ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు. దాసరి ఉదయం పత్రికలో ఎంతో మంది జర్నలిస్టులు ఉపాధి పొందారు.. దిగ్గజాలుగా ఎదిగారు. దాసరి అస్తమయం వేళ.. ఉదయం పత్రిక గురించి తెలుసుకుందాం..

దాసరి నారాయణ రావుగారు ఎంతో సదుద్ధేశంతో నిజాలు నిర్భయంగా చెబుతామని.. నాలుగు దశాబ్దాల క్రితం ‘ఉదయం’ అనే పత్రికను స్థాపించారు.. కానీ అది ఆర్థిక ఇబ్బందులతో కొన్నాళ్లకే మూతపడింది. ఈ పత్రికను కాంగ్రెస్ నేత, పార్లమెంటు సభ్యుడు మాగుంట సుబ్బిరామిరెడ్డి కొనుగోలు చేశారు. దాసరి అండదండలు అందజేశారు. సుబ్బిరామిరెడ్డి మద్యం వ్యాపారి కావడంతో ఉదయం నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాలేదు. ఈనాడుకు పోటీగా నిలిచిన ఉదయం పత్రికను ఎలాగైనా మూసివేయాలని ఈనాడు అధినేత రామోజీరావు ఏపీలో కృత్రిమ మద్యపాన నిషేధం ఉద్యమం లేవనెత్తారు.. దివంగత ఎన్టీఆర్ తో రాష్ట్రంలో మద్యపాన నిషేధం కోసం ఉద్యమించేలా చేశాడు. అనంతరం 1994 ఎన్నికల్లో టీడీపీకి ఈ మద్యపాన నిషేధం కలిసి వచ్చి అధికారం లభించింది. ఎన్టీఆర్ సీఎం అయ్యారు. మద్యపాన నిషేధం అమలైంది. మద్యం వ్యాపారం చేస్తున్న మాగంటి సుబ్బిరామిరెడ్డి వ్యాపారం ఢమాల్ అయ్యింది. దీంతో ఆయన ఉదయం పత్రికను మూసివేయక తప్పలేదు. ఇలా ఈనాడు అధినేత రామౌజీ రావు.. తన వ్యాపార విస్తరణకు అడ్డువచ్చిన ఉదయం పత్రికను చాకచక్యంగా ఎన్టీఆర్ సహాయంతో అడ్డుతొలగించాడు. ఉదయం పత్రికను కాలగర్భంలో కలిసేలా చేశాడు. కానీ ఉదయం ఇచ్చిన స్ఫూర్తి ఇప్పటికీ ఉంది. నాటి జర్నలిస్టులు ఇప్పటికీ వివిధ పత్రికల్లో అగ్రస్థానాల్లో ఉన్నారు. ఉదయం పత్రిక ఇచ్చిన ప్రోత్సాహాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

To Top

Send this to a friend