జియో ఫోన్ ఫ్రీ వెనుక కోట్ల దందా.?

ముఖేష్ అంబానీ.. దేశంలోనే నంబర్ 1 పారిశ్రామిక వేత్త . ఆయన ఏదీ చేసినా లాభాలు లేనిదే చేయడని తెలుసు. అలాంటి ఆయన ఫ్రీగా ఫోన్ ఇస్తామని ప్రకటన చేయగానే మిగితా టెలికాం కంపెనీల షేర్లన్నీ కుదేలయ్యాయి. వినియోగదారులు మాత్రం తమకు ఫ్రీగా ఫోన్ వస్తుందని సంబరాల్లో మునిగి తేలారు. నిజానికి నిన్న ప్రకటించిన జియో ఫోన్ ఫ్రీ వెనుక పెద్ద దందానే ఉంది. దీని వల్ల ముఖేష్ కు వేలకోట్ల లాభం, వడ్డీ రూపంలో వస్తోంది. దాంతో పోలిస్తే రూ.500 ఫోన్ ఫ్రీగా ఇవ్వడం పెద్ద సమస్య కాదు. అందుకే ఈప్లాన్ చేశాడు. అటు దీనివల్ల జియో ఫోన్ల కస్టమర్లు పెరగడంతో పాటు ఆదాయం వస్తుంది. ఇటు ఫోన్ ఫ్రీ అంటూ 1500 తీసుకోవడం వల్ల కోట్ల వడ్డీ తనకు దక్కుతుంది.

ఇప్పటికే జియో ఉచిత సర్వీసుల వల్ల ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్, బీఎస్ఎన్ఎల్, ఎయిర్ సెల్, టెలినార్, రిలయన్స్ లు పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయాయి. టెలినార్, ఎయిర్ సెల్, రిలయన్స్ లు నష్టాలు తట్టుకోలేక మిగతా టెలికాం సంస్థలకు అమ్మడమో, విలీనం కావడానికో ప్రయత్నాలు చేస్తున్నాయి. టెలినార్ అయితే ఎయిర్ టెల్ కు అమ్ముడుపోయింది కూడా. ఇక ఐడియా, వోడాఫోన్ లు కూడా కలిసిపోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇలా జియో దెబ్బకు కుదేలవుతున్న టెలికాం సంస్థలను భారీగా నష్టపరిచి ఆ తర్వాత తన ఇష్టానుసారం రేట్లు పెంచడానికి అంబానీ ప్లాన్ చేసినట్టు తెలిసింది. మార్కెట్లో జియోకు పోటీ లేకుండా చేయడమే ఇప్పుడు ముఖేష్ అంబానీ ప్రథమ కర్తవ్యంగా కనిపిస్తోంది. అందుకోసమే ఆయన ఫ్రీ ఫోన్ తో పాటు ఉచిత డేలా, కాల్స్ , ఎస్.ఎం.ఎస్ సేవలు అందిస్తున్నారు.

ఇలా అందరూ జియోకు మారాక, మిగతా సర్వీస్ ప్రొవైడర్లన్నీ నష్టాలతో మునిగిపోయాక జియో రేపు రేట్లు పెంచదన్న గ్యారెంటీ అయితే లేదు. ముఖేష్ అంబానీ టార్గెట్ కూడా అదే. దేశంలోని 70 కోట్ల మందిని జియో సిమ్ వాడేలా చేసి.. మిగితా టెలికాం సంస్థలను ముంచేశాక.. తీరిగ్గా అప్పుడు రేట్లు పెంచినా అడిగేవారు ఉండరనేది ఆయన ధీమా..

* అంబానీ గారు 1500 కి ఇచ్చే మొబైల్ గురించి వాస్తవాలు ఇలా ఉన్నాయి..
– జియో ఫోన్ ఫ్రీగా ఇచ్చి 1500 ఒక్కో మనిషి దగ్గర డిపాజిట్ గా తీసుకుంటే కనీసం ఒక పది లక్షల మంది మొబైల్ కొన్న 10,00,000X1500 = 1500000000 అక్షరాల నూటా యాభై కోట్ల రూపాయలు. దానికి వడ్డీ రూపాయి చొప్పున వేసుకున్న నెలకు కోటిన్నర, 3 సంవత్సరాలకు 36 X 1,50,00,000= 540,000,000 అక్షరాల 54 కోట్ల రూపాయల వడ్డీ ఈ మూడు సంవత్సరాలకు ఉచితంగా అందుతుంది..

జియో ఫోన్ విలువ రూ.500 అనుకున్నా ఆయనకు ఈ మూడేళ్లకు 1000 లాభంగా అందుతున్నమాట.. ఇది కేవలం పది లక్షల మొబైల్ సేల్స్ కి మాత్రమే, మరో 10 కోట్ల మంది కనుక ఫ్రీగా 1500 చెల్లించి ఫోన్ తీసుకుంటే ఇంకా మరింత కోట్ల వడ్డీ ఆయన ఖాతాల్లో చేరుతుంది. ఈ గణాంకాల్లో భారీ మార్పు ఉంటుంది… ఎంతైనా బిజినెస్ మైండ్ బిజినెస్ మైండే.. ముఖేష్ అంబానీ బుర్రకు సలాం కొట్టాల్సిందే.. ఇటు ఫ్రీగా ఫోన్ ఇచ్చి అటు కోట్ల లాభాలు పొందడం అంటే మాటలా..? ముఖేష్ నువ్ గ్రేట్ పో..

To Top

Send this to a friend