క్రియేటివ్‌ డైరెక్టర్‌ కాస్త బూతు డైరెక్టర్‌ అయ్యాడు

క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పేరు దక్కించుకున్న కృష్ణ వంశీ ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని తెరకెక్కించిన చిత్రం ‘నక్షత్రం’. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఆ సినిమా కొన్ని కారణల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఇటీవలే విడుదలైన ఆడియో, ట్రైలర్‌ మరియు పోస్టర్స్‌తో ఇదో బూతు సినిమా మాదిరిగా అనిపిస్తుంది.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా రెజీనా నటించిన విషయం తెల్సిందే. రెజీనా అందాలు ఏ రేంజ్‌లో ప్రదర్శించిందో ట్రైలర్‌ మరియు పోస్టర్స్‌ను చూస్తుంటేనే అర్థం అవుతుంది. సందీప్‌ కిషన్‌తో ఆమె చేసిన రొమాన్స్‌ దుమ్ము రేపుతుంది. రెజీనా అందాల కోసం అయినా సినిమా చూడాలనిపిస్తుంది. ఇక మరో ముఖ్య పాత్రలో నటించిన ప్రగ్యా జైస్వాల్‌తో సైతం స్కిన్‌ షో చేయించాడు. ఉన్నది కొద్ది సమయం అయినా కూడా ప్రగ్యా కూడా చూపించాల్సినవన్నీ కూడా చూపించేసింది.

వీరిద్దరి అందాలు తప్ప సినిమాలో కొత్తగా ఏమీ కనపడటం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి. క్రియేటివ్‌ దర్శకుడు ఇలా హీరోయిన్స్‌ గ్లామర్‌పై ఆధారపడటం ఆయన దిగజారుడుతనంకు అర్థం పడుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఆయన క్రియేటివిటీ అంతా పోయి ఇలా చెత్త సినిమాలు చేస్తున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి.

To Top

Send this to a friend