ఎన్టీఆర్ ఇల్లును ఎంతకు అమ్మేశారు..?

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీ రామారావు. ఆయన సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆయన ఏన్నో ఏళ్ల సినీ జీవితంలో చైన్నైలోని ఆయన సొంతింటి వేదికగానే జరిగింది. హైదరాబాద్ కు మారే వరకు ఎన్టీఆర్ చైన్నైలోని ఒకే ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన అపురూపంగా చూసుకున్న ఇంటిని ఆయన కొడుకులు కూతుళ్లు కలిసి అమ్మేశారు. ఎన్టీఆర్ ఎక్కువ కాలం నటుడిగా చైన్నైలోనే జీవించారు. చైన్నైలోని టీనగర్ లో గల బజ్జుల రోడ్ లో ఉండేది ఆయన ఇల్లు. ఎంతో విలాసవంతమైన ఆ ఇంటికి ఎన్టీఆర్ నందమూరి ఇల్లు అని నామకరణం చేశాడు. 1960 నుంచి 1980వరకు ఎన్టీఆర్ చైన్నైలోని నందమూరి నివాసంలోనే ఉన్నాడు. ఆయనను కలవడానికి వచ్చే నిర్మాతలు, దర్శకులతో ఆ ఇల్లు కళకళలాడేది. అప్పట్లో తిరుపతి వెళ్లిన వారు చైన్నై వెళ్లి టీనగర్ లోని ఎన్టీఆర్ ను కలుసుకొని వచ్చేవారట..

అయితే 1980 తరువాత తెలుగ సినిమా పరిశ్రమ హైదరాబాద్ కి తరలిరావడంతో ఎన్టీఆర్ కూడా హైదరాబాద్ కు మకాం మార్చేశాడు. ఆయన జీవించి ఉన్నంతకాలం ఆ ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారట.. ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఆ ఇంటిని నందమూరి కుటుంబసభ్యులు కానీ టీడీపీ నేతలు కానీ పట్టించుకోలేదు. దీంతో ఆ ఇల్లు ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. దీంతో ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్లు ఎన్టీఆర్ పేరు మీద ఆయన వస్తువులతో మ్యూజియం చేయాలని అప్పట్లో అనుకున్నా అధి సాధ్యపడలేదు. దీంతో ఈ ఇంటిని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అమ్మేయాలని డిసైడ్ అయ్యారు. మార్కెట్లో అమ్మకానికి పెట్టగా 170 కోట్ల రూపాయలు పలికిందట.. ఓ బడా బాబు ఈ ఇంటికి కొన్ని నెలల క్రితం కొని డబ్బులు కూడా ముట్టజెప్పాడట.. ఆ ఇంటిని అమ్మడం ద్వారా వచ్చిన సొమ్మును కొడుకులు, కూతుళ్లు సమంగా పంచుకున్నారట..

ఇందులో కొంత భాగాన్ని లక్ష్మీ పార్వతికి, బాలక్రిష్ణ నిర్వహిస్తున్న బసవతారకం ఆస్పత్రికి కూడా విరాళంగా అందజేసినట్టు సమాచారం. ఎన్టీఆర్ కూతురు , చంద్రబాబు భార్య భువనేశ్వరీ తనకు వచ్చిన మొత్తాన్ని బసవతారకం ఆస్పత్రికి ఇచ్చేశారట.. ఎక్కడా లొల్లి లేకుండా సైలెంట్ గా ఆ 170 కోట్లను అందరూ పంచేసుకున్నట్టు సమాచారం

To Top

Send this to a friend