మెగా 151వ చిత్రం మారింది


మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెం.150’ విడుదలై ఆరు నెలలు కాబోతుంది. ఆ చిత్రం ప్రమోషన్‌ సమయంలో వెంటనే మరో సినిమాను ప్రారంభించి, ఈ సంవత్సరం మరో రెండు సినిమాలు విడుదల చేస్తానంటూ ఫ్యాన్స్‌కు మెగాస్టార్‌ హామీ ఇచ్చాడు. కాని ఇప్పటి వరకు మెగాస్టార్‌ తన 151వ సినిమాను మొదలు పెట్టింది లేదు. గత అయిదు నెలలుగా చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ అంటూ ప్రచారం జరిగింది. కాని తాజాగా ఆ ప్రాజెక్ట్‌ ఇప్పుడు కాదంటూ వార్తలు వచ్చాయి.

ఉయ్యాలవాడ సినిమా ప్రస్తుత పరిస్థితుల్లో చేయడం మంచి నిర్ణయం కాదనే ఉద్దేశ్యంతో మెగా ఫ్యామిలీ వెనుకడుగు వేసినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ కాదు అని తేలిపోయిన నేపథ్యంలో మరి చిరంజీవి తర్వాత సినిమా ఎవరితో అంటూ మెగా ఫ్యాన్స్‌లో చర్చ మొదలైంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిరంజీవి 151వ చిత్రం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా బోయపాటి శ్రీను ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా మరో నెల రోజుల్లోనే పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఆ వెంటనే అంటే రెండు మూడు నెలల్లో చిరంజీవి కోసం స్క్రిప్ట్‌ను పూర్తి చేసి సినిమాను మొదలు పెట్టాలని బోయపాటి భావిస్తున్నారు. అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మించే అవకాశాలున్నాయి. అతి త్వరలోనే ఈ విషయమై మెగా ఫ్యామిలీ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.

To Top

Send this to a friend