కేసీఆర్ పై సామాన్యుడి మాట..

తెలంగాణలో ఏం నడిస్తుంది.. కేసీఆర్ పాలన ఎలా సాగుతుంది.. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎవరు ఏమనుకుంటున్నారు. సామాన్యుడి ఆలోచనల్లో తెలంగాణ ఎలా ఉంది. పోలీసులు ఏం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు సక్కని పూసలేనా..? బడిపోరగాళ్లు బడిలో చదువుకుంటున్నారా.? తెలంగాణ వచ్చినంక భూ కబ్జారాయుళ్లు వెనక్కి తగ్గారా.? తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని కలలు గన్న నిరుద్యోగుల ఆశలు నెరవేరాయా.? ఇలా ఓ సామాన్యుడి తెలంగాణ ప్రభుత్వం గురించి.. కేసీఆర్ గురించి ఏమనుకుంటున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇలా ఓ సామాన్యుడి ఆవేదనలో తెలంగాణలో ఏం నడుస్తుందంటే..

‘‘తెలంగాణలో నయీం చచ్చిపోయాడు.. స్వారీ చంపేశారు. కానీ తను మంచోడు. పరులకు కలలో కూడా అపాయం చేయలేదు.. చేసినా వాడితో ఎవరూ దోస్తీ కట్టలేదు.. కట్టినా వారిలో పెద్ద పెద్ద లీడర్లు, పోలీసులు, మంత్రులు, ముఖ్యమంత్రులు లేరు. ఒకవేళ ఉన్నా బయటపడనివ్వలేదు.. బయట పడ్డదంతా చోట మోటా పేపర్ రాతలు రాసుకునే అమాయకులే అని చెప్పాలా..

డ్రగ్స్ కేసులో వందల సంఖ్యలో ముఠా పట్టుబడింది. ఈ డ్రగ్స్ బడి ఈడు పిల్లల జేబుల్లోకి వెళుతుంది.. మత్తుకు బానిసైన బళ్లు పెద్ద పెద్ద కార్పోరేట్ బళ్లు.. కానీ ఈ కేసులో ఓ ఐఫీఎస్ ఆఫీసరే అత్యుత్సాహాం ప్రదర్శించాడు.. అనసరంగా తెలంగాణ విద్యావ్యవస్థను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు.. మంచోళ్లను బద్నాం చేస్తూ డ్రగ్స్ కేసులో ఇరికిస్తున్నాడు. నైజీరియన్లు చాలా మంచోళ్లు అసలు హైదరబాద్ ల మత్తు మందులే దొరకట్లే అని విద్యా మంత్రి కడియం చెప్పిన మాటలే నిజమని చెప్పాలా.

మియపూర్ లో వందల వేల ఎకరాల భూమి కబ్జా అయింది. పాలనలో ఉన్న బడా బడా నేతలు అధికారులు పక్క రాష్ట్రపు ప్రతిపక్షపు లీడర్లు ఈ కేసులో ఉన్నారు.. కానీ ఈ వార్తలన్నీ మీడియానే కల్పంచుకుని రాస్తుంది అసలు మియపూర్ లో భూమి ఏడికి పోలేదు ఉన్నకాన్నే ఉంది.. రాత్రికి రాత్రికి సబ్ రిజిస్టర్లను బదిలీ చేసింది కూడా ఉత్తుత్తిదే అని చెప్పాలా..

గ్రూప్ 2 పరీక్షలు బ్రమ్మాడంగా నిర్వహించాం. 1:2 కి బదులుగా 1:3 పిలిచి మానవత్వం చాటుకున్నాం. పాపం వైట్నర్ పెట్టిన వాళ్లు కూడా నిరుద్యోగులే కదా అని ఏదో చూసి చూడినట్టు వదిలేస్తే కోర్టుకు పోతారా.. అన్యాయం అక్రమం ప్రభుత్వం పై ప్రజలు, సామాన్యులు, నిరుద్యోగులు కావాలని కుట్రలు పన్నుతున్నారు ఇలా అయితే ప్రభుత్వం తన సత్తా చూపించాల్సి ఉంటుంది అని ప్రభుత్వం మాట్లాడుతున్న దోరణి అబద్దం అని చెప్పాలా…?

ఏ పరీక్ష చూసిన కోర్టు మెట్లెక్కనిదే పని కావాట్లేదని… ఆకర్కి కోర్టు మొట్టికాయలు వేస్తే దారికి రావట్లేదు. కోర్టే మా ప్రభుత్వం పై పగపట్టిందని అనుకోవాలేమో….
ఇక్కడంతా మంచే చెడు భూతద్దం పెట్టి వెతికొనా కనిపించడం లే…. మన సార్ అపర చాణక్య… మాయల మరాఠీ బిరిదు సార్థకత నామ దేయులు..’’ ఇలా ఓ సామాన్యుడు తెలంగాణ గురించి ఏమనుకుంటున్నాడో అనే దానికి అక్షర రూపం ఇస్తే అలా ఉంటుంది.

To Top

Send this to a friend