కామెంట్స్ కు బాధపడ్డా..


బాహుబలి రిలీజ్ రోజు తాను బయటకు రాలేదన్నారు హీరో ప్రభాస్. ప్రముఖ హిందీ చానల్ తో మాట్లాడిన ప్రభాస్ బాహుబలి 2 సినిమా విషయంపై తన మనోభావాలను వెల్లడించారు. కొందరు చేసిన కామెంట్స్ వల్ల తాను చాలా బాధపడ్డానని తెలిపారు. సినిమా తొలిరోజే కొందరు ప్లాప్ అనడం తనను కలిచి వేసిందని.. ఆ తర్వాత తెలుగు, హిందీల్లో హిట్ టాక్ రావడంతో ఊపిరి పీల్చుకున్నానని తెలిపాడు.

ఎవరో కొందరు చేసిన పనికి తాను ఎంతో బాధపడ్డానని చెప్పారు ప్రభాస్.. తెలుగు వెర్షన్ రిలీజ్ సందర్భంగా కొందరు బాహుబలి2పై నెగెటివ్ ప్రచారం చేశారని.. అంచనాలకు అనుగుణంగా లేదన్నారు. ఆ విమర్శలకు ఎంతో బాధపడ్డానని చెప్పాడు ప్రభాస్. బాహుబలి 2 కోసం రెండున్నరేళ్లు శ్రమించా.. ఆ శ్రమ అంతా వృథా అయ్యిందని మధనపడ్డానని తెలిపారు.

ఒక నటుడు చాలా కాలం పాటు ఒకే సినిమాకు తన కెరీర్ ధారపోసినప్పుడు ఆ చిత్రం సరిగా ఆడకపోతే అతను పడే బాధ ఆవేదన ఇలా ఉంటుందని ఆ చానల్ యాంకర్ ఈ సందర్భంగా ప్రభాస్ ను పొగిడారు.

To Top

Send this to a friend