రాధాకృష్ణకు బాబు భారీ గిఫ్ట్..

అస్మదీయులు ఎక్కడైనా ఒక ముక్క ఎక్కువే వడ్డిస్తారనే నానుడి ఉంది. అది మరోసారి నిరూపితమైంది. తమది పారదర్శక ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ విషయంలో మినహాయింపు కాదని నిరూపితమైంది. తమవారికి దోచిపెట్టడంలో చంద్రబాబుది పెద్ద చెయ్యే అని మరో ఘటన రుజువుచేసిందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

విశాఖపట్నం శివారులోని పరదేశిపాలెంలో రూ.15కోట్ల విలువైన 1.5 ఎకరాల భూమిని ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి కేవలం రూ.50 లక్షలకే కట్టబెట్టడం వివాదాస్పదమైంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఈ స్థలంలో తమ పత్రికా కార్యాలయం (ప్రెస్) ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్త భవనాన్ని ఇక్కడ అత్యాధునిక వసతులతో నిర్మించాలని యోచిస్తోంది..

ఆంధ్రజ్యోతి పత్రికకు 1986లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సీనియర్ ఎన్టీఆర్ 1.5 ఎకరాలను కేటాయించింది. జాతీయ రహదారి కోసం మళ్లీ ఎకరం భూమిని వెనక్కి తీసుకుంది. దానికి బదులుగా ఇప్పుడు మళ్లీ అదే ప్రాంతంలో ఎకరంన్నర కేటాయించాలని ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యం ఎకరం రూ.10వేలకే కేటాయించాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో తన మిత్రుడు రాధాకృష్ణకు చంద్రబాబు ఏకంగా 15కోట్ల విలువైన భూమిని 50లక్షలకే కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.

To Top

Send this to a friend