చిరు సినిమా మిస్ అవడానికి వాళ్లే కారణం..


‘చిరంజీవి 150వ సినిమా నేనే చేయాల్సింది. ‘ఆటోజానీ’ కథలోని ఫస్టాఫ్ చిరంజీవికి నచ్చింది. సెకండాఫ్ ను మార్చమని చెప్పారు. ఇది పక్కా కమర్షియల్ సినిమా. మిమ్మల్ని జనం ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తానని చిరంజీవితో అన్నానని’ ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాత్ అన్నారు.

కానీ ఆయనతో ఉండే రాజకీయ నాయకులే చిరంజీవిని కన్ఫూజ్ చేశారు. సందేశం ఉండే సినిమానే చేయాలని చిరుపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన ఆటోజానీని పక్కనపెట్టారు. లేకపోతే హ్యాపీగా ఆటోజానీ తీసేవాడ్ని. ఏదేమైనా చిరుతో సినిమా తీస్తా.. మెగాస్టార్ అంటే ఏమిటో చూపించాల్సిందే.. ఒకప్పుడు ఆయన సినిమా కోసం క్యూలో నిల్చొని టికెట్లుకొని సినిమా చూశా.. బ్యానర్లు కట్టాను. ఎప్పటికైనా చిరుతో సినిమా తీస్తానని చెప్పారు పూరి జగన్నాథ్..

పూరిజగన్నాథ్ కన్నడలో తీసిన రోగ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి సినిమా మిస్ అవడానికి గల కారణాలను వివరించారు. దీంతో పాటు తాను బాలయ్యతో తీస్తున్న కొత్త సినిమా విశేషాలను పంచుకున్నాడు. ఏప్రిల్ నుంచి రెండో షెడ్యూల్ ఉంటుందన్నారు. బాలక్రిష్ణ ఉదయం 6 గంటలకే షూటింగ్ కు వస్తున్నారని.. ఇంత పంక్చూవాలిటీ ఉన్న నటుడు తెలుగు ఇండస్ట్రీలోనే లేనడన్నారు.

కాగా బాలయ్యతో తీసే సినిమాకు ‘ఉస్తాద్’ అనే పేరును పరిశీలిస్తున్నట్టు పూరి చెప్పారు. ఈ సినిమాలో ఇంకా హీరోయిన్, నటుల ఎంపిక జరగలేదని.. రెండో షెడ్యూల్ నాటికి ఎంపికచేస్తానని తెలిపారు.

To Top

Send this to a friend