చిరంజీవి ఓ గుణపాఠం రజినీ రాజకీయం..

అన్నింటా గోప్యత.. ఎక్కడా ఏ విషయాన్ని రిలీవ్ చేయకుండా పకడ్బందీగా ముందుకెళ్తున్నారు. రాజకీయ పార్టీ ప్రకటనతో పాటు ఓ పొలిటికల్ నేపథ్య సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. అభిమానులతో భేటిలోనూ కార్యాచరణ చెబుతున్నారు. ఎక్కడా మీడియాకు, బయట ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని అభిమానులకు రజినీకాంత్ స్పష్టం చేశాడు. ఇతర కార్యక్రమాల్లో కూడా అనవసర రాజకీయ చర్చను అభిమానులు తీసుకురావద్దని రజినీకాంత్ అల్టీమేటం జారీ చేశారని సమాచారం.

ఇటీవల ఆలిండియా రజినీకాంత్ ఫ్యాన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రజినీ అభిమానులతో భేటి అయ్యారు. అందులో తన అభిమానులకు పార్టీ నిర్మాణం, తదితర వ్యూహాలపై ఎక్కడా నోరు జారవద్దని సూచించారట.. ఏ టీవీ చర్చల్లో పాల్గొనవద్దని.. రాజకీయ కార్యకలాపాలు పార్టీ ప్రారంభించక ముందు నిర్వహించవద్దని సూచించారు. దీన్ని అతిక్రమించిన రజినీ అభిమాన సంఘం నాయకుడు సైదాపేట జి.రవిని తొలగించి అభిమానులకు స్పష్టమైన హెచ్చరికలు పంపాడు రజినీకాంత్. అంతేకాదు జి.రవితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని అందరికీ ఒక ప్రకటనలో సూచించారు.

చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మంచివారనుకొని చాలా మందిని పార్టీలో చేర్చుకున్నారు. పరకాల ప్రభాకర్ లాంటి మేధావులు కూడా రచ్చకెక్కి చిరంజీవి ప్రజారాజ్యంను ముంచేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చి కోవర్టుగా మారి ప్రజారాజ్యంను ఓడించారు. అందుకే రజినీ చిరంజీవి అనుభవాలను క్రోడీకరించుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఏ నాయకుడిని ఇప్పటివరకు చేర్చుకోలేదు. తనకు నష్టం చేకూరుస్తున్న అభిమాన సంఘం నేతలను తొలగిస్తున్నారు. ఇలా వడివడిగా.. జాగ్రత్తగా రజినీ తన కొత్త రాజకీయ పార్టీకి పురుడు పోస్తున్నారు.

To Top

Send this to a friend