చిరంజీవి యోధుడైతే..

ఒక ఉరుము.. ఒక మెరుపు.. యోధుడిగా చిరంజీవిగా.. నల్లమల అడవుల్లో గుర్రంపై ప్రయాణం.. వెనుక విల్లంబులు.. చూపులో రాజసం.. చిరంజీవి సినిమాలో ఇంత వీరఆవేశంతో నటిస్తాడో లేదో తెలియదు కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాపై ఆయన అభిమాని వేసిన ఓ పోస్టర్ సినిమాపై హైప్ ను రెట్టింపు చేసింది. ఎవరు చేశారో ఎలా చేశారో తెలియదు కానీ అచ్చం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెరపై ఎలాం ఉండాలని అభిమానులు కోరుకుంటారో.. అలానే స్కెచ్ గీసి చిరంజీవి పరాక్రమాన్ని చూపించారు.

చిరు ఉయ్యాలవాడ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రాంచరణ్ నిర్మాతగా.. చిరంజీవి హీరోగా తెరకెక్కుతోంది. పరిచూరి బ్రదర్స్ తో పాటు మరో ముగ్గురు రచయితలు ఈ సినిమా కథకు మెరుగులు దిద్దుతున్నారు. హీరోయిన్ గా ఐశ్వర్యరాయ్ ని నటింపచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొద్దిరోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.

చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా తెరపై ఎలా ఉండాలని కోరుకుంటారో.. అలా ఓ అభిమాని స్కెచ్ గీశారు. దాన్ని కింద చూడొచ్చు..

To Top

Send this to a friend