చైనా పాక్ కుమ్మక్కు…ఇదిగో సాక్ష్యం..!

భారతదేశ పతనాన్ని చూడటమే చైనా, పాకిస్థాన్ ల ధ్యేయం. ఇది అందరికీ తెలిసిన మాటే అయినా, ఇన్నాళ్లూ సరైనా సాక్ష్యం లేదు. కానీ తొలిసారి భారత్ కు వ్యతిరేకంగా ఈ రెండు దేశాలూ ఎలా కుట్ర పన్నుతున్నాయో రెడ్ హ్యాండెడ్ గా సాక్ష్యం దొరికింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. ఇంతకూ పాక్, చైనా కుమ్మక్కయ్యాయని చెప్పగల ఆ సాక్ష్యం ఏంటి అంటారా..? అక్కడికే వస్తున్నాం.

అంతర్జాతీయ స్థాయిలో విదేశాల్లో పర్యటనలు ఒక ప్రత్యేక పద్ధతిలో నడుస్తాయి. శత్రుదేశమైనా, మిత్రదేశమైనా, ఒక దేశానికి వెళ్లినప్పుడు, దేశ ప్రతినిథి ఏ పని మీద వెళ్లారో ఆ పని మాత్రమే చూసుకుని వచ్చేస్తారు. కానీ మన దేశంలోని పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్, న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయంలో రహస్యంగా చైనా హైకమిషనర్ తో భేటీ అవడం సంచలనంగా మారింది. సాధారణంగా ఈ మీటింగ్ గురించి ఎవరికీ తెలిసి ఉండేది కాదేమో కానీ, నిరంతరం అలెర్ట్ గా ఉండే మన జర్నలిస్టులు పసిగట్టేశారు.

చైనా ఎంబసీ నుంచి బాసిత్ బయటికి హడావిడిగా వస్తున్న ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఒక దేశాధికారి, మరో దేశాధికారితో దొంగతనంగా, ప్రెస్ నుంచి పారిపోయేంత రహస్య మీటింగ్ వేసుకోవడం చర్చకు దారితీస్తోంది. డోక లామ్ వివాదంలో చైనా, పాకిస్థాన్ లు కావాలనే ఒక ఏకాభిప్రాయానికి వచ్చి మరీ భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నది స్పష్టం. పోనీ ఇది అధికారిక సమావేశమా అంటే, పాకిస్థాన్ కు ప్రస్తుతం చైనాతో ద్వైపాక్షిక ఒప్పందాలేవీ పెండింగ్ లో లేవు. ఇంతకూ భేటీ అయి, ఈ రెండు దేశాలూ చేసిన కుమ్మక్కు ఏమై ఉంటుందో తెలుసా..?

డోక లామ్ వివాదంలో, భారత సైనికుల్ని ఆ ప్రాంతం నుంచి వెనక్కి పిలిచిన తర్వాతే తాము చర్చలకు వస్తామంటూ తెగేసి చెబుతోంది చైనా. ఇప్పటికే మన దేశం కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ తో ఇదే పద్ధతి ఫాలో అవుతోంది. కశ్మీర్ విషయంలో పాక్ తో చర్చలు జరపాలంటే, ఆ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులను, సైన్యాన్ని పాక్ వెనక్కి పిలవాలని, అప్పటి వరకూ చర్చలకు వెళ్లేది లేదని, తన సైన్యాన్ని వెనక్కి పిలిచేది లేదని ఇండియా ఖచ్చితంగా చెబుతోంది. ఈ విషయంలో భారత్ కు ఝలక్ ఇచ్చే ఉద్దేశ్యంతోనే చైనా అదే పద్ధతిని అవలంబిస్తోందని, చైనాతో డోక లామ్ ఇష్యూ తొలగాలంటే, భారత్ పాక్ విషయంలో మెత్తబడేలా చేయాలనేది పాక్-చైనాల వ్యూహంలా కనిపిస్తోంది. అయితే చైనా, పాకిస్థాన్ లు కలిసి ఏం చేసినా, భారతదేశం ముందు వాటి పాచికలు పారవంటున్నారు విశ్లేషకులు.

To Top

Send this to a friend