టీడీపీకి గుదిబండగా బీజేపీ, వైసీపీకే లాభం

నంద్యాల ఉప ఎన్నిక రసకందాయంలో పడింది. టీడీపీ, వైసీపీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం ఉన్న బీజేపీ-టీడీపీలు నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా కలిసి ప్రచారం చేయాలని అనుకోవడం లేదు. బీజేపీ సీనియర్ నాయకులందరూ ప్రచారానికి నంద్యాలకు వస్తామన్నా చంద్రబాబు అంగీకరించడం లేదట.. ఎందుకు..? దీనివెనుక కారణమేంటనే ప్రశ్న టీడీపీ శ్రేణులను పీడిస్తోంది..

వైసీపీ నంద్యాలలో జోరుగా ప్రచారం చేస్తోంది. వైసీపీ అధినేత జగన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరుస్తున్నారు. అయితే టీడీపీలో ఆ ఊపు ఉత్సాహం లేదు. బాలక్రిష్ణ సహా పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించాలని టీడీపీ యోచించినా వారు బిజీగా ఉండడం వల్ల సాధ్యపడలేదు.

అయితే నంద్యాలలో ప్రచారం చేస్తామని ఇటీవల బీజేపీ నాయకులు చంద్రబాబును సంప్రదించారట.. అయితే చేయడానికి ఏం ఇబ్బంది లేదని.. కానీ బీజేపీ కండువా వేసుకొని కాకుండా ఏ కండువా లేకుండా ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారట.. ఎందుకంటే నంద్యాలలో 55వేల ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రస్తుతం తమకు మద్దతుదారులుగా ఉన్నారని.. బీజేపీ రంగప్రవేశం చేస్తే వారంతా వైసీపీకే ఓటు వేస్తారని బాబు విశ్లేషించారట. అలా బీజేపీ నంద్యాలలో టీడీపీ తరఫున ప్రచారం చేయకపోతేనే తమకు లాభం చేకూరుతుందని టీడీపీ అధినేత బీజేపీ నాయకులకు స్పష్టం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

To Top

Send this to a friend